Rajasthan: గెహ్లాట్‌కు ఆర్‍ఎస్ఎస్ ఫోబియా...బీజేపీ చీఫ్ ఫైర్..!
ABN, First Publish Date - 2023-05-12T14:42:01+05:30
జైపూర్: బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను ఫాసిస్టులంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆర్ఎస్‌ఎస్ అంటే గెహ్లాట్‌కు భయమని, అందువల్లే ఆయన ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని రాజస్థాన్ బీజేపీ చీఫ్ సీపీ జోషి అన్నారు.
జైపూర్: బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను ఫాసిస్టులంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) మండిపడింది. ఆర్ఎస్‌ఎస్ అంటే గెహ్లాట్‌కు భయమని, అందువల్లే ఆయన ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని రాజస్థాన్ బీజేపీ చీఫ్ సీపీ జోషి (CP Joshi) అన్నారు.
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశంలో ఎక్కడ విపత్తులు జరిగినా ఒక సైన్యంలా ఎలాంటి వివక్షా లేకుండా సమాజాన్ని రక్షించడానికి కృషి చేస్తున్నారని, కాంగ్రెస్ మాత్రం ఒక కుటుంబానికై అంకితమై చెల్లాచెదురైందని జోషి విమర్శించారు. ఉగ్రవాదులను గౌరవించడం, దేశభక్తులను నిదించడం వల్లే కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరిందన్నారు. గెహ్లాట్ ముందుగా తన పార్టీ నేతలే నిరంకుశుడిగా ఆయనను ఎందుకు అంటున్నారో గ్రహించాలని హితవు పలికారు.
''మేవాడ్ గాంధీగా ఆయన (గెహ్లాట్) తనను తాను చెప్పుకుంటారు. కానీ, అధికారంలో ఉన్న ఐదేళ్లు కుర్చీని కాపాడుకునేందుకే సరిపోయింది. 2023 ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ఆయనను పట్టుకుంది. రాహుల్ గాంధీ దృష్టిలో పడడం కోసమే ఆర్ఎస్ఎస్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు'' అని జోషి విమర్శించారు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బీజేపీ, ఆర్ఎస్‌లపై గెహ్లాట్ గురువారం విమర్శలు గుప్పించారు. ఆ నేతలు నిరంకుశులని, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలను కూలగొట్టారని, రాజస్థాన్‌లో బలమైన ప్రభుత్వం లేకపోయి ఉంటే ఇక్కడా అదే పరిస్థితి వచ్చేదని వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-05-12T14:42:05+05:30 IST