కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Muscat-Dhaka Flight: విమానంలో ప్రయాణికుడి వికృత ప్రవర్తన.. ఎయిర్ హోస్టెస్‌ని కౌగిలించుకొని, ఆపై ఏం చేశాడంటే?

ABN, First Publish Date - 2023-09-08T20:13:07+05:30

ఈ నెల 6వ తేదీన (బుధవారం) యూకే 234 అనే విస్తారా విమానం మస్కట్ నుంచి ఢాకాకి బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున ఇది ముంబైలో ల్యాండ్ చేయాల్సి ఉంది. అరగంటలో విమానం ముంబయికి చేరుతుందనగా..

Muscat-Dhaka Flight: విమానంలో ప్రయాణికుడి వికృత ప్రవర్తన.. ఎయిర్ హోస్టెస్‌ని కౌగిలించుకొని, ఆపై ఏం చేశాడంటే?

కామాంధులు రానురాను మరింత రెచ్చిపోతున్నారు. బహిరంగంగానే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా విమానంలో ఎయిర్ హోస్టెస్‌ని లైంగికంగా వేధించాడు. చుట్టూ వందలాది మంది ఉన్నప్పటికీ.. వాళ్ల ముందే బరితెగించేశాడు. ఫ్లైట్ అటెండెంట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెని కౌగిలించుకొని.. ఆపై ముద్దు పెట్టబోయాడు. ఈ ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


ఈ నెల 6వ తేదీన (బుధవారం) యూకే 234 అనే విస్తారా విమానం మస్కట్ నుంచి ఢాకాకి బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున ఇది ముంబైలో ల్యాండ్ చేయాల్సి ఉంది. అరగంటలో విమానం ముంబయికి చేరుతుందనగా.. మహమ్మద్ దులాల్ (30) అనే బంగ్లాదేశీయుడు ఒక్కసారిగా తన సీటులో నుంచి లేచాడు. పక్కనే ఉన్న ఎయిర్ హోస్టెస్‌ని ఒక్కసారిగా కౌగిలించుకున్నాడు. ఆపై ఆమెకు ముద్దు పెట్టబోయాడు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఎయిర్ హోస్టెస్.. వెంటనే తేరుకొని అతడ్ని నివారించింది. పక్కనే ఉన్న ప్రయాణికులతో పాటు విమానం సిబ్బంది అతడ్ని అడ్డుకున్నారు. అయితే.. వాళ్లను కూడా అతడు వెనక్కు నెట్టేశాడు. చివరికి ఎయిర్ హోస్టెస్ అతని బారి నుంచి తప్పించుకుంది.

అయితే.. నిందితుడు విమానం సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఇంతలో కెప్టెన్ దిగొచ్చి, అతడ్ని నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. అప్పటికీ ఆ వ్యక్తి వినకుండా, అతిగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కెప్టెన్.. రెడ్ వార్నింగ్ కార్డ్ జారీ చేసి, అతడ్ని వికృత ప్రయాణికుడిగా ప్రకటించాడు. అనంతరం ముంబయి ఎయిర్‌పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేశాక.. ఆ నిందితుడ్ని భద్రతా సిబ్బందికి అప్పగంచారు. ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. స్థానిక న్యాయస్థానంలో నిందితుడ్ని హాజరుపరిచారు. అతడ్ని శుక్రవారం వరకు కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది.

Updated Date - 2023-09-08T20:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising