ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bengaluru: ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన.. కేంద్రం మౌనం వెనుక అనుమానాలు

ABN, First Publish Date - 2023-10-04T12:24:55+05:30

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Former Chief Minister of Andhra Pradesh Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును

- ప్రవాసాంధ్రుల ఆగ్రహం

కంప్లి(బెంగళూరు): ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Former Chief Minister of Andhra Pradesh Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ బళ్లారి జిల్లా కురుగోడు పట్టణంలో ప్రవాసాంధ్రులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. బాదనహట్టి రోడ్డులోని సాయిబాబా మందిరం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్ర ప్రముఖులు శ్రీనివాస్‌ చక్రవర్తి, మిలటరీ ప్రసాద్‌రావు, రాజేంద్రప్రసాద్‌, బళ్లారి మాజీ మేయర్‌ రాజేశ్వరి, కుడితిన్ని శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం వల్ల అక్కడ ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అక్కడ రాక్షసపాలన సాగుతోందని విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం దారుణం అన్నారు. ఏపీ ప్రభుత్వం ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్‌కు బుద్ధి చెబుతారని తెలిపారు. వృద్ధులు విద్యావతి, పాపమ్మ చంద్రబాబుకు మద్దత్తుగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. ర్యాలీలో తెలుగు సంఘాలు, కమ్మ సంఘాలు, ప్రవాసాంధ్ర ప్రముఖులు నాగేశ్వరరావు, రమేష్‌, సూరిబాబు, సుధీర్‌, జేపీ చౌదరి, హరిబాబు, రాఘవేంద్ర, పవన్‌కుమార్‌, విజయలక్ష్మి, సురేంద్ర, వెంకటేశ్వరావు, మాణిక్యమ్మ, విజయలక్ష్మి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. వివిధ క్యాంపుల నుంచి తెలుగు ప్రజలు తరలి వచ్చారు.

Updated Date - 2023-10-04T12:24:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising