Bengaluru: ఏపీలో టీడీపీదే అధికారం.. సైకో పోయి బాబు వస్తారు
ABN, First Publish Date - 2023-12-02T12:19:19+05:30
రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి టీడీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది చంద్రబాబు పాలన వస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి
- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్
కంప్లి(బెంగళూరు): రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి టీడీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది చంద్రబాబు పాలన వస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్(Pattabhiram) పేర్కొన్నారు. ఆయనకు శుక్రవారం హోస్పేట రైల్వే స్టేషన్‌లో అఖిల భారత తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా సింధనూరు, గంగావతి, కంప్లి తదితర ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు(chandrababunayudu)కు మద్దతు పలికిన వారందరికి అభినందనలు తెలిపినట్లు చెప్పారు. గత నాలుగున్నర సంవత్సరాలకు పైగా అభివృద్ధి ఏమీలేదని, సీఎం జగన్‌రెడ్డి కేవలం హామీలకే పరిమితమయ్యారని విమర్శించారు. తమ నాయకుడు చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు పైగా జైల్లో వుంచారు. సైకో కావడం వల్లే ఇలా చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికీ ప్రతి గ్రామంలో వైసీపీ దౌర్జన్యాలు జరుగుతున్నాయని తెలిపారు. తమపై గూండాయిజం చేస్తున్నారని, పోలీస్‌స్టేషన్లకు వెళ్లినా పోలీసులు కూడా సైకో ప్రభుత్వానికే మద్దతు పలుకుతున్నారన్నారు. కొందరు నాయకులను అరెస్టు చేసి జైలు పాలు చేశారని, అయినా బెదిరింపులు లెక్కచేయకుండా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబునాయుడుకు మద్దతు పలుకుతున్నారన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అమరావతి, విశాఖపట్టణం, కర్నూలు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గారిపాటి రామకృష్ణ, కుడితిని రాము, నెక్కంటి సురేష్, శ్రీనివాసులు, రాంబాబు, సుబ్బారావు, హరీష్ బాబు, శ్రీహర్ష, కిషోర్, విశ్వనాథ్, పాండురంగ, వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-02T12:19:21+05:30 IST