ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS: ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కళ్లు చెదిరే సదుపాయాలు

ABN, First Publish Date - 2023-05-03T21:11:44+05:30

ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కళ్లు చెదిరే సదుపాయాలున్నాయి.

Bharat Rashtra Samithi Delhi office details
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi) పార్టీ విస్తరణ, కార్యకలాపాల కోసం గత ఏడాది ప్రారంభించిన నాలుగు అంతస్తుల బీఆర్‌ఎస్‌ పార్టీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేశ సమగ్ర వికాసమే లక్ష్యంగా, రైతు రాజ్య స్థాపనే ధ్యేయంగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(KCR) ఢిల్లీలోని (Delhi) బసంత్ విహార్‌లో మే 4న (గురువారం) ప్రారంభించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయం ఉనికిలోకి రానుండటంతో బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త విస్తరణ వేగవంతం కానుంది. అత్యంత ప్రామాణికమైన వాస్తుశాస్త్ర సూత్రాలను అనుసరించి కార్యాలయం నిర్మించారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. కార్యాలయంలోకి కేసీఆర్ వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి అడుగుపెట్టనున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఢిల్లీ బీఆర్ఎస్ భవన్ నిర్మాణానికి సంబంధించిన పనులను నిరంతరం పర్యవేక్షించి ప్రారంభోత్సవ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ వివరాలు:

11 వేల చదరపు అడుగుల స్థలంలో బిఆర్ఎస్ భవన్ నిర్మాణం

నాలుగు అంతస్తులు

లోయర్ గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్

గ్రౌండ్ ఫ్లోర్ లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల ఛాంబర్‌లు

మొదటి అంతస్తులో బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఛాంబర్, ఇతర ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్

2,3వ అంతస్తుల్లో మొత్తం 20 రూములు, ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్, మరో 18 రూములు

Updated Date - 2023-05-03T21:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising