ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gnanavapi Masjid: అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీకి సుప్రీంలోనూ చుక్కెదురు

ABN, First Publish Date - 2023-08-04T20:54:23+05:30

జ్ఞానవాపి మసీద్‌ ప్రాంగణంలో ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) శాస్త్రీయ సర్వేపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తవ్వకాలు లేకుండా, నిర్మాణానికి నష్టం వాటిల్లకుండా మొత్తం సర్వేను పూర్తి చేస్తామని ASI స్పష్టం చేసినట్లు ధర్మాసనం తెలియజేసింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్‌ఐ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీద్‌ ప్రాంగణంలో ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) శాస్త్రీయ సర్వేపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తవ్వకాలు లేకుండా, నిర్మాణానికి నష్టం వాటిల్లకుండా మొత్తం సర్వేను పూర్తి చేస్తామని ASI స్పష్టం చేసినట్లు ధర్మాసనం తెలియజేసింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్‌ఐ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. సుప్రీం కోర్టులో కూడా అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీకి చుక్కెదురైంది. ఏఎస్‌ఐ శాస్త్రీయ సర్వేను నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వలేమని దేశ అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) నిపుణులు శుక్రవారం నుంచి ఈ సర్వేను ప్రారంభించారు.


కాశీ విశ్వనాథుడి ఆలయానికి పక్కనే ఉన్న ఈ మసీదును.. హిందూ ఆలయం స్థానంలో నిర్మించారని, శాస్త్రీయ సర్వే నిర్వహించి ఈ విషయాన్ని తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు వారాణసీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దానిపై విచారణ నిర్వహించిన కోర్టు సర్వే చేపట్టాలని జూలై 21న ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జూలై 24న ఏఎస్‌ఐ అధికారుల బృందం సర్వే ప్రారంభించింది. అయితే, దీనిపై మసీదు కమిటీ జూలై 25న సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం సర్వే నిర్వహణపై జూలై 26 సాయంత్రం 5 గంటల దాకా స్టే విధించి, వారాణసీ కోర్టు తీర్పుపై అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

సుప్రీం సూచన మేరకు మసీదు కమిటీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఇరు వర్గాల వాదనలూ విన్న హైకోర్టు సర్వేకు అనుమతిస్తూ గురువారం తీర్పునిచ్చింది. సర్వే నిర్వహించాలన్న వారాణసీ జిల్లా కోర్టు తీర్పు సరైనది, సముచితమైనది అని.. దాంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరమేమీ లేదని స్పష్టం చేస్తూ మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టేసింది. విచారణ సమయంలో మసీదు కమిటీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎఫ్‌ఏ నక్వీ.. ఏఎస్‌ఐ అధికారులు మసీదు ప్రాంగణం వద్దకు తీసుకొచ్చిన డిగ్గింగ్‌ ఎక్విప్‌మెంట్‌ (తవ్వడానికి ఉపయోగించే పరికరాల) ఫొటోలను కోర్టుకు సమర్పించారు. అక్కడ తవ్వకాలు జరిపే ఆలోచన ఏఎస్‌ఐకి ఉందని తెలిపారు. దీనికి అలహాబాద్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ దివాకర్‌ స్పందిస్తూ.. సర్వేలో భాగంగా ఎలాంటి తవ్వకాలూ జరపరాదని నొక్కిచెప్పారు.

Updated Date - 2023-08-04T20:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising