ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bihar Migrant Workers Attack: నకిలీ వీడియోల కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

ABN, First Publish Date - 2023-03-12T17:42:19+05:30

బీహార్ వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరిగినట్టు నకిలీ వీడియోలను సృష్టించిన కేసులో నిందితుల కోసం ఇరురాష్ట్రాల పోలీసులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పాట్నా: బీహార్ వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరిగినట్టు నకిలీ వీడియోలను సృష్టించిన కేసులో నిందితుల కోసం ఇరురాష్ట్రాల పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నకిలీ వీడియోలను సృష్టించిన మనీష్ కశ్యప్ అనే ప్రధాన నిందితుడిని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని యూట్యూబర్‌గా గుర్తించారు. ఈ కేసులో మనీష్ కశ్యప్‌తో పాటు యువరాజ్ సింగ్, అమన్ కుమార్, రాకేష్ రంజన్ కుమార్ అనే నిందితులను పోలీసులు గుర్తించారు. వీరిలో కశ్యప్‌తో పాటు అమన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

''నకిలీ వీడియోలను సృష్టించిన కేసులో ప్రధాన నిందితుడైన రంజన్ కుమార్ గోపాల్‌గంజ్ జిల్లాకు చెందినవాడు. పాట్నాలోని బంగాలి కాలనీలో ఉంటున్నారు. ఇద్దరు వ్యక్తుల సాయంతో మార్చి 6న నకిలీ వీడియోలు సృష్టించాడు. రంజన్ కుమార్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. బీహార్, తమిళనాడు పోలీసులను తప్పుదారి పట్టించడమే ఈ నకిలీ వీడియోల ప్రధాన ఉద్దేశం. రాకేష్ రంజన్ కుమార్ ఉంటున్న ఇంటి యజమానిని కూడా ప్రశ్నించాం. తన ఇంట్లోనే వీడియో తయరైనట్టు అతను కూడా ధ్రువీకరించాడు'' అని పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు. రాకేష్ రంజన్, మనీష్ కశ్యప్, యోగిరాజ్ సింగ్, అమన్ కుమార్‌లపై పాట్నాలోని ఆర్థిక నేరాల నిరోధక విభాగం పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదయినట్టు చెప్పారు.

కాగా, మనీష్ కశ్యప్‌పై పలు ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పుల్వామా ఘటన అనంతరం పాట్నాలోని లాహ్సా మార్కెట్‌లో కొందరు కశ్మీర్ పండిట్లపై జరిగిన దాడిలో కూడా కశ్యప్ ప్రమేయం ఉందని. దీనికితోడు గతంలో పలు అభ్యంతరకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.

రెండు ఎఫ్ఐర్‌ల నమోదు

బీహార్ వలస కార్మికులపై తమిళనాడులో దాడుల పేరుతో నకిలీ వీడియాలు సృష్టించిన ఘటనపై బీహార్ పోలీసులు రెండు ఎఫ్ఐఅర్‌లు నమోదు చేశారు. యూబ్యూట్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లలో 30 వీడియోలు పోస్ట్ అయినట్టు గుర్తించారు. 26 అనుమానాస్పద సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించడంతో పాటు, సోషల్ మీడియా అకౌంట్లున్న మరో 42 మందికి ప్రిజర్వేషన్ నోటీసులు ఇచ్చారు.

Updated Date - 2023-03-12T17:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising