ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bihar: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు, నెల రోజుల్లో రెండోసారి

ABN, First Publish Date - 2023-01-21T17:06:00+05:30

బీహార్‌లోని కతిహార్ జిల్లాలో 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్'పై రాళ్లు రువ్విన ఘటన చోటుచేసుకుంది. న్యూ జల్‌పాయ్‌గురి నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: బీహార్‌లోని కతిహార్ (Katihar) జిల్లాలో 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్' (Vande Bharat Express)‌పై రాళ్లు రువ్విన ఘటన చోటుచేసుకుంది. న్యూ జల్‌పాయ్‌గురి నుంచి హౌరాకు వెళ్తున్న ట్రైన్ నెంబర్ 22302పై శుక్రవారం సాయంత్రం రాళ్లు రువ్విన ఘటన చోటుచేసుకున్నట్టు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. తాను ప్రయాణిస్తున్న కోచ్‌కు రాయి వచ్చి తగిలినట్టు ఒక ప్రయాణికుడు ట్రైన్ ఎస్కార్ టీమ్‌కు ఫిర్యాదు చేశాడని కతిహార్ రైల్వే డివిజన్ సీనియర్ భద్రతాధికారి కమల్ సింగ్ చెప్పారు.‌ బల్రాంపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని డాల్ఖోలా, టెల్టా స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుందన్నారు.

ఘటన అనంతరం డల్కోలా రైల్వే అధికారులు సదరు బోగీని తనిఖీ చేసి విండో అద్దాలు పగలినట్టు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాష్ట్రంలో రాళ్లు రువ్వుడు ఘటనలు చోటుచేసుకోవడం గత నెలరోజుల్లో ఇది రెండవది. జనవరి 3న కిసాన్‌గంజ్ జిల్లాలో రైలుపై రాళ్లు రువ్వగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు పిల్లల్ని గుర్తించి వారిని జ్యువనైల్ జస్టిస్ బోర్డు ముందు పోలీసులు హాజరు పరిచారు. పశ్చిమబెంగాల్‌లోనూ ఇటీవల ఈ తరహా ఘటనే చోటుచేసుకోగా, దీనిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. ఇలాంటి నిరాధార వార్తలు రాస్తే మీడియో సంస్థలపై దావా వేస్తానని హెచ్చరించారు.

Updated Date - 2023-01-21T17:06:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising