Gangster Bahubali leader: ఆనంద్ మోహన్ 14 ఏళ్ల తర్వాత జైలు విడుదల...బీహార్ సర్కారు ఉత్తర్వులు
ABN, First Publish Date - 2023-04-25T07:23:19+05:30
రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్‌స్టర్, బీహార్(Bihar) స్ట్రాంగ్ మ్యాన్ ఆనంద్ మోహన్ సింగ్ 14 ఏళ్ల తర్వాత జైలు నుంచి...
పాట్నా(బీహార్): రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్‌స్టర్, బీహార్(Bihar) స్ట్రాంగ్ మ్యాన్ ఆనంద్ మోహన్ సింగ్ 14 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు.(Gangster Bahubali leader)ఓ హత్య కేసులో ఇప్పటికే 14 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్న ఆనంద్ మోహన్ సింగ్(Gangster-politician Anand Mohan) సత్ప్రవర్తన కారణంగా విడుదల(Release) కానున్నారు.1994వ సంవత్సరంలో ముజఫర్‌పూర్‌లో ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్యపై హత్య కేసుకు సంబంధించి జీవిత ఖైదు అనుభవిస్తున్న బాహుబలి నాయకుడు ఆనంద్ మోహన్ సింగ్ సహా ఇతర ఖైదీలను విముక్తి చేస్తూ బీహార్ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఆయన తన కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ వివాహం కోసం పెరోల్‌పై జైలు బయట ఉన్నారు.తాజా ఉత్తర్వులతో ఆనంద్ మోహన్ ఏప్రిల్ 25వతేదీన తిరిగి జైలుకు వెళ్లి లాంఛనాలను పూర్తి చేసి ఏప్రిల్ 26వతేదీన జైలు నుంచి బయటకు రానున్నారు. ట్రయల్ కోర్టు బాహుబలి నాయకుడికి మరణశిక్ష విధించింది. అయితే అతను పాట్నా హైకోర్టులో అప్పీల్ చేయడంతో అది మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది.
ఇది కూడా చదవండి : Tsunami warning: సుమత్రా దీవుల్లో భారీ భూకంపం...సునామీ హెచ్చరిక...సురక్షిత ప్రాంతాలకు సముద్ర తీరప్రాంతవాసుల తరలింపు
ఆనంద్ మోహన్ సుప్రీంకోర్టులో కూడా అప్పీలు చేసినా అది హైకోర్టు తీర్పును సమర్థించింది. ఆనంద్ మోహన్‌తో పాటు, అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మరో బాహుబలి నాయకుడు రాజ్ బల్లభ్ యాదవ్‌తో సహా మరో 26 మంది వ్యక్తులు బీహార్ సర్కారు తాజా ఉత్తర్వులతో జైలు నుంచి విడుదల కానున్నారు.
Updated Date - 2023-04-25T07:31:29+05:30 IST