ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP Vs Congress : రాహుల్ గాంధీపై మరోసారి విరుచుకుపడిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ

ABN, First Publish Date - 2023-06-29T12:37:03+05:30

భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవీయ (Amit Malviya) మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై విరుచుకుపడ్డారు. రాహుల్ అమెరికా పర్యటనను ఉటంకిస్తూ, ఆయన ‘ప్రమాదకారి’ అని ఇచ్చిన ట్వీట్‌ నేపథ్యంలో తనపై కేసు నమోదైనప్పటికీ మాలవీయ వెనుకంజ వేయడం లేదు. రాహుల్ శాంతి దూత కాదని, రాజకీయ అవకాశవాది అని దుయ్యబడుతూ గురువారం ట్వీట్ చేశారు.

Amit Malaviya, Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవీయ (Amit Malviya) మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై విరుచుకుపడ్డారు. రాహుల్ అమెరికా పర్యటనను ఉటంకిస్తూ, ఆయన ‘ప్రమాదకారి’ అని ఇచ్చిన ట్వీట్‌ నేపథ్యంలో తనపై కేసు నమోదైనప్పటికీ మాలవీయ వెనుకంజ వేయడం లేదు. రాహుల్ శాంతి దూత కాదని, రాజకీయ అవకాశవాది అని దుయ్యబడుతూ గురువారం ట్వీట్ చేశారు.

మణిపూర్‌లో మే నెల నుంచి మెయిటీలు, కుకీల మధ్య హింసాకాండ జరుగుతోంది. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గురు, శుక్రవారాల్లో పర్యటించబోతున్నారు. ఇంఫాల్, చురాచాంద్‌పూర్‌లలో ప్రజా సంఘాలతో ఆయన సమావేశమవుతారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ దుయ్యబడుతోంది.

ఈ నేపథ్యంలో అమిత్ మాలవీయ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, 2015-17 మధ్య కాలంలో మణిపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ నేత, అప్పటి ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వం మూడు బిల్లులను తీసుకొచ్చేందుకు ప్రయత్నించిందని గుర్తు చేశారు. మణిపూర్ ప్రజల పరిరక్షణ బిల్లు, 2015; మణిపూర్ ల్యాండ్ రెవిన్యూ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ (సెవెన్త్ అమెండ్‌మెంట్) బిల్లు, 2015; మణిపూర్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (సెకండ్ అమెండ్‌మెంట్) బిల్లు, 2015లను ఆమోదింపజేసేందుకు ప్రయత్నించడంతో చురాచాంద్‌పూర్‌లో హింసాకాండ జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మెయిటీలు గిరిజన భూములను లాక్కునేందుకు కుట్ర పన్నారనే ఆందోళనతో నిరసనలు జరిగాయని చెప్పారు. ఈ హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు అప్పట్లో రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లలేదనే విషయాన్ని గుర్తు చేశారు.

తొమ్మిది మంది యువకులపై కాల్పులు జరిగాయని, వారు ప్రాణాలు కోల్పోయారని, నిరసన తెలుపుతున్న జాతులవారు రెండేళ్ళపాటు వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి తిరస్కరించారని చెప్పారు. అప్పట్లో రాహుల్ గాంధీ అక్కడికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఆయన శాంతి దూత కాదని, కేవలం రాజకీయ అవకాశవాది అని చెప్పారు. అగ్గి రాజుకోవాలని, సమస్య నిరంతరం కొనసాగాలని కోరుకునే రాజకీయ అవకావాది అని ఆరోపించారు. మణిపూర్‌లో పర్యటించాలనే ఆలోచన రాహుల్ గాంధీకి రావడానికి కారణం అక్కడి ప్రజల కష్టాలను చూసి, ఆందోళన చెందడం కాదని, కేవలం తన స్వీయ రాజకీయ ఎజెండాయేనని ఆరోపించారు. ఆయనను కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ ఎవరూ నమ్మకపోవడానికి కారణం ఉందన్నారు.

అమిత్ మాలవీయ ఇటీవల రాహుల్ గాంధీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఓ ట్వీట్ చేశారు. రాహుల్ ప్రమాదకారి అని వ్యాఖ్యానించారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ నేత ఒకరు చేసిన ఫిర్యాదు ఆధారంగా మాలవీయపై బెంగళూరు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించారని, ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి :

Obama Vs Modi : బరాక్ ఒబామా ఓ ప్రైవేట్ వ్యక్తి : అమెరికా

Eid al-Adha : ఈద్ అల్-అదా పండుగ సందర్భంగా మోదీ శుభాకాంక్షలు

Updated Date - 2023-06-29T12:37:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising