BJP MLA: బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్... ఆమె ఏమన్నారో తెలిస్తే...
ABN, First Publish Date - 2023-09-05T10:12:34+05:30
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) చేసిన ప్రకటనతో డీఎంకే నాయకులంతా హిందువులకు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) చేసిన ప్రకటనతో డీఎంకే నాయకులంతా హిందువులకు వ్యతిరేకులని స్పష్టంగా రుజువైందని మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్(MLA Vanathi Srinivasan) అన్నారు. సనాతన ధర్మం హిందువులనే గుర్తు చేస్తుందని, సనాతన ధర్మం అంటే మానవులు ఆచరించే ధర్మమని, అదే సమయంలో ఆ ధర్మాన్ని సాకుగా పెట్టుకుని ఓ మతాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని దాడికి పాల్పడడం న్యాయమేనా? ఇతర మతాలలో అంటరానితనం లేదా? మూఢ నమ్మకాలు లేవా? అని ప్రశ్నించారు. మూఢ నమ్మకాలు, అంట రానితనం నిర్మూలన అంటూ మహానాడు జరపాలనుకుంటే ఆయా మతాల పేర్లను కూడా పెట్టుకుని జరుపవచ్చు కదా అని అన్నారు. హిందువులను దూషించి, మైనారిటీలను పొగడితే వారి ఓట్లను సంపాదించుకోవాలని ఆశపడుతున్నారని చెప్పారు. మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) గతంలో తన భార్య క్రైస్తమతానికి చెందినదై ఉండటం తనకెంతో గర్వంగా ఉందని చెప్పారని, ఆ మత పెద్దల సభలలో పాల్గొని మీవల్లే మేం గెలిచామని కూడా ప్రకటించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానని చెప్పారు.
Updated Date - 2023-09-05T10:12:35+05:30 IST