ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP MP: బీజేపీ ఎంపీ అంతమాట అనేశారేంటో.. రాష్ట్రంపై కనికరం చూపని కేంద్రం

ABN, First Publish Date - 2023-11-03T13:07:21+05:30

కేంద్రం ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో బిజీగా ఉందని రాష్ట్రంలో కరువు పరిస్ధితిని ఆలకించే తీరిక లేదని బీజేపి ఎంపీ బీఎన్‌. బచ్చేగౌడ

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కేంద్రం ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో బిజీగా ఉందని రాష్ట్రంలో కరువు పరిస్ధితిని ఆలకించే తీరిక లేదని బీజేపి ఎంపీ బీఎన్‌. బచ్చేగౌడ(BJP MP BN. Bachegowda) ఆవేదన వ్యక్తంచేశారు. చిక్కబళ్ళాపురంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రం కరువుతో అలమటిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని 33వేల కోట్ల మేరకు పంటనష్టం సంభవించిందని తక్షణ సాయంగా రూ 17వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి మొరపెట్టుకున్నా ఫలితం కనిపించడం లేదన్నారు. ప్రతియేటా రాష్ట్రానికి న్యాయసమ్మతంగా లభించాల్సిన జిఎ్‌సటి వాటా విడుదల విషయంలో కేంద్రం ఉదాసీనత ప్రదర్శిస్తోందన్నారు. అధికారం శాస్వతం కాదన్న విషయాన్ని కేంద్రంలోని పాలకులు గుర్తించుకుని సమాఖ్య వ్యవస్ధను గౌరవించాలని ఆయన హితవు పలికారు. కరవుకోరల్లో చిక్కుకున్న రాష్ట్రరైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

Updated Date - 2023-11-03T13:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising