ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP MP: బీజేపీ ఎంపీ ఎంత మాట అనేశారేంటో..

ABN, First Publish Date - 2023-04-16T11:30:18+05:30

భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఒక వేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తాలిబాన్‌ సంస్కృతి ఖాయమని మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్‏సింహ(Mysore BJP MP Pratap Simha) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ఎ న్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్‌ ఎస్‌డీపీఐ, పీఎఫ్ఐ, కేఎఫ్‏డీ వంటి ఉగ్రవాద సంస్థలతో లోపాయికారి ఒప్పందాలను కుదర్చుకుంటోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తమై కాంగ్రె్‌సను చిత్తుగా ఓడించాలని బీజేపీకి పూర్తి మెజార్టీ ఇవ్వాలని ఆయన సూచించారు. 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు కుట్రలు పన్నుతున్న ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు, సంఘ విద్రోహక శక్తులతో కాంగ్రెస్‌ అంటకాగుతోందని ఆ యన విరుచుకుపడ్డారు. బీజేపీ(BJP) అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ శాంతి భద్రతలు దివ్యంగా ఉన్నాయని, తోకాడించే శక్తుల పీచమణిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. బీజేపీదే తాలిబాని మనస్తత్వమని విరుచుకుపడింది. నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే విద్వేషపూర్తి అజెండాను తెరపైకి తెచ్చారని, ప్రజలు ఎవరికి బుద్దిచెబుతారో తెలుసుకునేందుకు మరో నెల రోజులు ఆగాలని బీజేపీ నేతలకు కాంగ్రెస్‌ సూచించింది.

Updated Date - 2023-04-16T11:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising