ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP Vs Congress : హిమాచల్ ప్రదేశ్‌లో ఆపిల్ పండ్ల రైతులకు మద్దతు ఏదీ?.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన బీజేపీ..

ABN, First Publish Date - 2023-07-30T16:22:15+05:30

కాంగ్రెస్ నేత‌త్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆపిల్ పండ్ల రైతులకు అండగా నిలవడం లేదని బీజేపీ ఆరోపించింది. ఆపిల్ పండ్లను రైతులు కాలువల్లో పారబోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల కోసం రాహుల్ గాంధీ కన్నీరు పెట్టుకుంటారని, వాస్తవంలో కాంగ్రెస్ రైతులకు అండగా నిలవడం లేదని దుయ్యబట్టింది.

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత‌త్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆపిల్ పండ్ల రైతులకు అండగా నిలవడం లేదని బీజేపీ ఆరోపించింది. ఆపిల్ పండ్లను రైతులు కాలువల్లో పారబోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల కోసం రాహుల్ గాంధీ కన్నీరు పెట్టుకుంటారని, వాస్తవంలో కాంగ్రెస్ రైతులకు అండగా నిలవడం లేదని దుయ్యబట్టింది.

బీజేపీ నేత అమిత్ మాలవీయ (Amit Malaviya) ఆదివారం ఎక్స్-వేదికగా (ట్విటర్) ఓ వీడియోను షేర్ చేశారు. కొందరు రైతులు ఓ వ్యానులో ఆపిల్ పండ్లను తీసుకొచ్చి, కాలువలో పారబోస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆపిల్ పండ్లు కుళ్లిపోతుండటంతో రైతులు ఈ విధంగా చేస్తున్నట్లు తెలిసింది. కొండచరియలు విరిగిపడటం, వరదల వల్ల ఈ పండ్లు సకాలంలో మార్కెట్‌కు చేరకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈసారి మనం అన్ని ఆపిల్ పండ్లను కాలువలోనే పోయవలసి వస్తుందేమోనని ఈ వీడియోలో ఓ వ్యక్తి అంటుండటం వినిపించింది.

అమిత్ మాలవీయ ఇచ్చిన ట్వీట్‌లో, ఆపిల్ పండ్లను సకాలంలో మార్కెట్‌కు తరలించడంలో రైతులకు సహాయపడటంలో కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని, అందువల్ల వాటిని పండించిన రైతులు మరో దిక్కు లేక కాలువలో పారబోస్తున్నారని తెలిపారు. ఓవైపు రాహుల్ గాంధీ రైతుల కోసం కన్నీళ్లు పెట్టుకుంటారని, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు సాయం చేయవలసి వచ్చేటప్పటికి విధ్వంసకరంగా మారుతున్నాయని ఆరోపించారు. పండ్లు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతుండటానికి కారణం ఇదేనని అన్నారు. ఇటీవల టమాటాలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు నానా అవస్థలు పడిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి :

Gujarat : అహ్మదాబాద్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. 100 మంది రోగుల తరలింపు..

Moscow : మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. దెబ్బతిన్న రెండు భవనాలు..

Updated Date - 2023-07-30T16:26:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising