ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi Disqualification: షాకింగ్ కామెంట్స్ చేసిన కమలనాథులు

ABN, First Publish Date - 2023-03-24T18:38:32+05:30

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై(Disqualification of Rahul Gandhi as Lok Sabha MP) భారతీయ జనతా పార్టీ(BJP) స్పందించింది.

Rahul Gandhi Disqualification BJP
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై(Disqualification of Rahul Gandhi as Lok Sabha MP) భారతీయ జనతా పార్టీ(BJP) స్పందించింది. తిట్టే హక్కు ఎవ్వరికీ లేదని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. చట్టం ముందు అందరూ సమానులేనన్నారు.

సూరత్ కోర్టు తీర్పు చారిత్రకమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) చెప్పారు. చట్టం ముందు అందరూ సమానులేనని, కోర్టు తీర్పుతో బీజేపీకి ఏ సంబంధమూ లేదన్నారు. తిట్టే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. మోదీ ఇంటి పేరు కలవాలందరూ దొంగలే అని రాహుల్ అనడం తప్పని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.

కులం మొత్తాన్నీ దొంగ అని రాహుల్ ఎలా అంటారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్(Union Minister Bhupender Yadav) ప్రశ్నించారు. వాక్ స్వాతంత్ర్యం( Freedom of speech) అంటే కులాలను అవమానపరచడం కాదన్నారు. రాహుల్ ఓబీసీ కులాలను(OBC community) తిట్టాడని, విమర్శించలేదని భూపేంద్ర యాదవ్ గుర్తు చేశారు. పైగా తన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పడం లేదన్నారు. విదేశాల్లో కూడా రాహుల్ దేశాన్ని అవమానించారని భూపేంద్ర యాదవ్ చెప్పారు.

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(MP CM Shivraj Singh Chouhan) స్పందించారు. తప్పులు చేసిన వారు వాటి పర్యవసానాలను ఎదుర్కోవల్సిందేనన్నారు.

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు విషయంలో ఏ రాజకీయ కుట్రా లేదని బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ మోదీ(Sushil Modi) చెప్పారు. కోర్టు ద్వారా తీర్పు వచ్చిందని, దాన్ని అంగీకరించాల్సిందేనన్నారు.

రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే బెయిల్‌పై బయట ఉన్నారని, తాను పార్లమెంట్‌కు, చట్టానికి, న్యాయానికి, దేశానికి అతీతుడనని భావిస్తాడని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్(Union Min Anurag Thakur) ఎద్దేవా చేశారు.

2019 ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలకుగాను కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధించింది. అయితే, ఆయనకు రూ.10 వేల బాండుతో బెయిల్‌ ఇచ్చి, పైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలుగా 30 రోజులపాటు శిక్షను నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొంది. అప్పట్లో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్‌ మోదీ క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు.

కర్ణాటకలోని కోలార్‌లో 2019 ఏప్రిల్‌ 13న ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ‘మోదీ’ అనే ఇంటిపేరు ఉన్నవారందరినీ, మోదీ ‘కమ్యూనిటీ’ని అవమానించే విధంగా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2021 అక్టోబరులో రాహుల్‌గాంధీ ఈ కేసు విచారణ నిమిత్తం సూరత్‌ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలను ప్రధాని మోదీని ఉద్దేశించి చేశారు కాబట్టి.. వేస్తే ప్రధానే దీనిపై కోర్టును ఆశ్రయించి ఉండాల్సిందని, పూర్ణేశ్‌ మోదీ కాదని రాహుల్‌ తరఫు న్యాయవాది వాదించారు. అలాగే.. మోదీ అనే ‘కమ్యూనిటీ’యే లేదు కాబట్టి అసలు ఈ కేసు చెల్లదని కోర్టుకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిని బయటపెట్టడం తప్ప.. రాహుల్‌ వ్యాఖ్యల వెనుక వేరే ఎలాంటి దురుద్దేశాలూ లేవని వెల్లడించారు. కేసు విచారణ కిందటివారమే ముగియగా.. ఇరుపక్షాల తుది వాదనలూ విన్న కోర్ట్‌ ఆఫ్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హెచ్‌హెచ్‌ వర్మ.. తీర్పును వాయిదా వేశారు. ఆ తీర్పును గురువారం ప్రకటించారు.

‘‘రాహుల్‌ తన వ్యాఖ్యలను ప్రధాని మోదీ, నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా, మేహుల్‌ చోక్సీ, అనిల్‌ అంబానీకి పరిమితం చేసుకుని ఉండాల్సింది. కానీ, ఆయన ఉద్దేశపూర్వకంగానే ‘మోదీ’ అనే ఇంటిపేరు కలిగి ఉన్న వ్యక్తులకు బాధకలిగించే వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్‌ పరువునష్టానికి పాల్పడ్డారు’’ అని తన తీర్పులో పేర్కొన్నారు. తన వ్యాఖ్యల ప్రభావం ప్రజల్లో ఎంతగా ఉంటుందనే విషయం.. దాని ద్వారా ఏమేరకు ప్రయోజనాలు పొందగలననే విషయం కూడా ఆయనకు తెలుసని తీర్పులో వ్యాఖ్యానించారు. 2018లో రాహుల్‌ చేసిన ‘చౌకీదార్‌ చోర్‌హై’ వ్యాఖ్యల విషయంలో సుప్రీంకోర్టు చేసిన సూచనల గురించి.. అప్పట్లో రాహుల్‌ బేషరతు క్షమాపణలు చెప్పిన విషయాన్ని కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు.

రాహుల్‌ వ్యాఖ్యల వల్ల.. ఫిర్యాదిదారుకు ఎలాంటి బాధ, నష్టం కలగలేదని, రాహుల్‌ గతంలో ఎలాంటి కేసులోనూ దోషి కాడని.. కాబట్టి తేలికపాటి శిక్ష విధించాలని రాహుల్‌ న్యాయవాది చేసిన వ్యాఖ్యలతో కూడా న్యాయమూర్తి ఏకీభవించలేదు. కాగా.. తీర్పు వెలువడే సమయంలో రాహుల్‌ గాంధీ కోర్టుహాల్‌లోనే ఉన్నారు.

నిజాలు మాట్లాడినందుకు రాహుల్‌ గాంధీకి శిక్ష పడిందని.. సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన పైకోర్టులో అప్పీలు చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. కోర్టు గుజరాతీ భాషలో ఇచ్చిన 170 పేజీల తీర్పును ఆంగ్లంలోకి అనువాదం చేయాల్సి ఉందని.. దీనిపై అప్పీలుకు వెళ్లే పనిలో ఉన్నామని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. ఈ తీర్పుపై చట్టప్రకారమే ముందుకెళ్లి, ఊరట పొందుతామని చెప్పారు. రాహుల్‌ను దోషిగా పేర్కొన్న ఈ తీర్పును.. దుర్బలమైన, తప్పులతో కూడిన, చట్టపరంగా నిలవని తీర్పుగా ఆయన అభివర్ణించారు.

రాహుల్‌ తాను చేసే ప్రకటనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు గతంలోనే సూచించింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు లేదు. ఆయన సిట్టింగ్‌ పార్లమెంటు సభ్యుడు. ఒక ఎంపీగా.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు (ఇలాంటి వ్యాఖ్యలు) తీవ్రమైన విషయం. ఎంపీల ప్రకటనలకు విస్తృత ప్రభావం ఉంటుంది. ఈ కోణంలో చూస్తే ఆయన చేసిన నేరం (పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం) మరింత తీవ్రమైనది. దీనికి తక్కువ శిక్ష విధిస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. అంతేకాదు, పరువునష్టం దావా ప్రయోజనాలు నెరవేరనట్టేనని సూరత్ కోర్ట్ అభిప్రాయపడింది.

సూరత్ కోర్టు తీర్పు రాగానే లోక్‌సభ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

Updated Date - 2023-03-24T18:38:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising