ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్‌ సంచలన కామెంట్స్.. ఉచిత చీరల కొనుగోలులో రూ.88 కోట్ల అవినీతి

ABN, First Publish Date - 2023-10-29T11:59:51+05:30

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబ రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేసే ఉచిత చీరలు, ధోవతుల కొనుగోళ్లలో రూ.88 కోట్ల మేరకు

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబ రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేసే ఉచిత చీరలు, ధోవతుల కొనుగోళ్లలో రూ.88 కోట్ల మేరకు అవినీతి జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆరోపించారు. పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదేళ్లుగా అమలు చేసిన నిషేధాన్ని తొలగించి చెరువుల్లో మట్టి తవ్వకాలకు పాల్పడిందన్నారు. ఈ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ భారీ స్థాయిలో కొనసాగుతోందన్నారు. ఖనిజ సంపదను సంరక్షించేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన డీఎంకే దాన్ని నిలబెట్టుకోకపోగా ఇసుక దందాను ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. సర్కారు బడుల్లో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థుల యూనిఫాం కోసం కుటుంబ కార్డుదారులకు పండుగ సీజన్‌లో పంపిణీ చేసే ఉచిత చీరలు, ధోవతులను ప్రైవేటు సంస్థల నుంచి కమిషన్‌ తీసుకుని ఆ సంస్థల నుంచే దుస్తులను కొనుగోలు చేస్తోందన్నారు. ఇందువల్ల రాష్ట్రంలోని నేత కార్మికులకు చెందాల్సిన ఫలితాలు అవినీతి డీఎంకే ధనాగారానికి చేరాయని అన్నామలై చెప్పారు.

Updated Date - 2023-10-29T11:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising