ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ మూడో విడత పాదయాత్ర ప్రారంభం

ABN, First Publish Date - 2023-10-17T12:58:19+05:30

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(State BJP president Annamalai) ‘ఎన్‌ మన్‌... ఎన్‌ మక్కల్‌’ నినాదంతో మూడో విడత పాదయాత్ర

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(State BJP president Annamalai) ‘ఎన్‌ మన్‌... ఎన్‌ మక్కల్‌’ నినాదంతో మూడో విడత పాదయాత్ర తిరుప్పూర్‌ జిల్లా అవినాశి నుంచి సోమవారం ఉదయం ప్రారంభించారు. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, సమాచార, ప్రచార శాఖ మంత్రి ఎల్‌.మురుగన్‌ ప్రారంభించిన పాదయాత్రలో సుమారు 500 మందికి పైగా బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. అవినాశి సేవూరు రోడ్డులో ప్రారంభమైన పాదయాత్ర తహసీల్దార్‌ కార్యాలయం, ఉత్తర, పశ్చిమ రథ వీధులు, సుందరం వీధుల మీదుగా సుమారు 2 కి.మీ దూరం సాగింది. పాదయాత్ర సాగిన మార్గంలో పలువురు అన్నామలైకు వినతిపత్రాలను అందించారు. పాదయాత్రను సందర్భంగా అవినాశి పట్టణంలో బీజేపీ జెండాలు, కమలం గుర్తు తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. డప్పు కళాకారులు నృత్యం చేస్తూ సందడి చేశారు. జూన్‌ 28న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రామనాథపురం జిల్లా రామేశ్వరంలో అన్నామలై తొలివిడత పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర రామనాథపురం, శివగంగ, మదురై, విరుదునగర్‌, తూత్తుకుడి, కన్నియాకుమారి, తిరునల్వేలి జిల్లాల మీదుగా సాగింది. సెప్టెంబరు 3న తెన్‌కాశి జిల్లా అలంగుళంలో ప్రారంభించిన పాదయాత్ర 27న ముగిసింది. కాగా, సోమవారం రాత్రి కోయంబత్తూర్‌ జిల్లా మేట్టుపాళయంలో బసచేసి మరుసటిరోజు ఈరోడ్‌ జిల్లాలో పర్యటిస్తారు. 19న తిరుప్పూర్‌ జిల్లా, 25న పెరుందురై, 26న ఈరోడ్‌ ఈస్ట్‌, 27న సంగగిరి, 28న నామక్కల్‌ జిల్లాల్లో అన్నామలై మూడవ విడత పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-10-17T12:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising