ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్‌ సంచలన కామెంట్స్.. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు...

ABN, First Publish Date - 2023-05-13T07:38:01+05:30

బీజేపీ రాష్ట్ర చీఫ్‌ సంచలన కామెంట్స్ చేశారు. ఉడత ఊపులకు భయపడతానా.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): డీఎంకే మంత్రుల అవినీతి అక్రమాలకు సంబంధించి రెండో జాబితాను జూలై రెండో వారంలో విడుదల చేస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ప్రకటించారు. స్థానిక టి.నగర్‌లోని పార్టీ కార్యాలయం కమలాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటైన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర పాడి పరిశ్రమల శాఖ మంత్రి ఆవడి నాజర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించారని, గతంలో తాను ఆయనపై చేసిన ఆరోపణల వల్లే మంత్రి పదవి కోల్పోయారని చెప్పారు. నాజర్‌ను తొలగించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త పాడిపరిశ్రమల శాఖ మంత్రి పాల ఉత్పత్తిదారులకు లబ్ధి కలిగించేలా పాల కొనుగోలు ధరలను పెంచి, ఆవిన్‌ సంస్థ ద్వారా ప్రజలకు తక్కువ ధరకు పాలను సరఫరా చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు.

రాజాకు మంత్రి పదవా?

20 కంపెనీలు నడుపుతున్న కుటుంబానికి చెందిన టీఆర్‌బీ రాజాకు పరిశ్రమల శాఖను కేటాయించడం గర్హనీయమని అన్నామలై పేర్కొన్నారు. ఎంపీ టీఆర్‌ బాలు తన కంపెనీలకు మద్దతుగా వ్యవహరించారని లోక్‌సభ రికార్డుల్లోనే నమోదై ఉందని గుర్తు చేశారు. టీఆర్‌ బాలు తనపై దాఖలు చేసిన పరువునష్టం దావాకు తాను భయపడనని, ఈ చర్యల వల్ల ఆయనపై ఆరోపణలు అధికమవుతాయని హెచ్చరించారు. అలాగే ఆర్థిక మంత్రిగా పళనివేల్‌ త్యాగరాజన్‌(Palanivel Thyagarajan) సమర్థవంతంగా పనిచేస్తున్నారంటూ పలు సభల్లో పదేపదే పొగడుతూ వచ్చిన సీఎం స్టాలిన్‌ ఆ శాఖ నుంచి ఆయన్ని ఎందుకు తప్పించారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. పళనివేల్‌ ఆడియోలో మార్పులు చేసినట్లు తెలుస్తోందని, ఆ ఆడియోలో ముఖ్యమంత్రి స్టాలిన్‌పై ఆయన చేసిన ఆరోపణలు వాస్తవమేనని చెప్పారు. ఆ ఆడియోను బహిర్గత పరచిన తనపై కేసు వేస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin), ఆయన కుటుంబీకుల అవినీతి అక్రమాలు పళనివేల్‌ త్యాగరాజన్‌కు తెలుసు కనుకే ఆయనను మంత్రిగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు పళనివేల్‌ త్యాగరాజన్‌ మాట్లాడిన ఆడియోకు సంబంధించి రెండు భాగాలను తానింకా వెల్లడించలేదని చెప్పారు. ఇప్పటివరకూ డీఎంకే(DMK) వర్గాలు తనపై రూ.1461 కోట్లడగుతూ పరువు నష్టం దావాలు వేశారని, దేశంలో ఇంతపెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలంటూ కేసులు వేసినవారెవరూ లేరన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాష్ట్రంలో బీజేపీ ఎప్పటికి ఎదగదంటూ చెప్పేవారని, ప్రస్తుతం డీఎంకే తమ నుంచి రూ.1461 కోట్ల మేరకు డబ్బులడిగే స్థాయికి తమ పార్టీ అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు.

పాలకపక్షాన్ని ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టి నిలదీసే స్థాయికి బీజేపీ ఎదిగిందని సగర్వంగా చెప్పుకుంటున్నానన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) సహా డీఎంకే నాయకులు దాఖలు చేసిన పరువునష్టం దావాలకు తాను భయపడే ప్రసక్తే లేదని, చట్ట ప్రకారం వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటానన్నారు. డీఎంకే మంత్రుల అవినీతి అక్రమాలకు సంబంధించి రెండో జాబితాను జూలై రెండో వారంలో వెల్లడిస్తానని చెప్పారు. మొదటి జాబితాలో 11 మంది ఉన్నారని, రెండో జాబితాలో కొత్త మంత్రులు సహా 21 మంది అవినీతి అక్రమాల వివరాలుంటాయని అన్నామలై పేర్కొన్నారు.

Updated Date - 2023-05-13T07:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising