ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP state president: అవినీతిపరులైన మీకు సేద్యం గొప్పదనం ఏం తెలుసు?

ABN, First Publish Date - 2023-07-18T08:12:09+05:30

అవినీతిలో కూరుకుపోయిన డీఎంకే ఎంపీ రాజాకు వ్యవసాయం విశిష్టతలేమిటో తెలిసే ఆస్కారం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీఎంకే ఎంపీ రాజాకు అన్నామలై కౌంటర్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): అవినీతిలో కూరుకుపోయిన డీఎంకే ఎంపీ రాజాకు వ్యవసాయం విశిష్టతలేమిటో తెలిసే ఆస్కారం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ధ్వజమెత్తారు. ఎంపీ రాజా ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ గౌండర్‌ కులస్థులను బీసీల జాబితాలో చేర్చుతూ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కలం ద్వారా సంతకం పెట్టకపోయినట్లయితే అన్నామలై ఐపీఎస్‌ చదివే అవకాశం ఉండేది కాదని, మేకలు మేపుకుంటూ ఉండేవారని, ఎడప్పాడి పళనిస్వామి బెల్లంమండీని నడుపుకుంటూ ఉండేవారని, బీజేపీ శాసనసభ్యురాలు వానతి శ్రీనివాసన్‌(BJP MLA Vanathi Srinivasan) బుట్టలు అల్లుకుంటూ ఉండేవారని విమర్శించారు. ఆవిమర్శలను అన్నామలై తీవ్రంగా ఖండిస్తూ సోమవారం ఉదయం ట్విట్టర్‌లో ఓ సందేశం పొందుపరిచారు. అవినీతి ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టినవారంతా దర్జాగా తిరుగుతుండగా మేకలు మేపటం, బెల్లం మండీ నడపటం, బుట్టలు అల్లడం వంటి వ్యవసాయ సంబంధిత వృత్తులన్నీ ఎంపీ రాజా(MP Raja)కు హీనమైన వృత్తులుగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కొంగు మండలంలో పచ్చదనం ఉంటే రాష్ట్రమంతటా పచ్చదనం ఉంటుందనే సామెత కరుణానిధికి ముందే జనబాహుళ్యంలో నానుడిగా ఉండేదని చెప్పారు. కొంగుమండలానికి డీఎంకే పాలకులు చేసిందేమీ లేదని, 1970లో విద్యుత్‌ ఛార్జీల పెంపును ఖండిస్తూ ఆందోళన జరిపిన ముగ్గురు రైతులనుకాల్చి చంపారని ఆరోపించారు. కఠిన శ్రమతో వ్యవసాయ పనులద్వారా సంపాదించే కొంగు మండలంలోని వ్యవసాయ వృత్తులవారిని ఎంపీ రాజా కించపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇకనైనా ఎంపీ రాజా నోటి దురుసును మానుకోవాలని అన్నామలై హితవుపలికారు.

Updated Date - 2023-07-18T08:12:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising