ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: వీరి కలయిక సార్వత్రికం కోసమేనా..?

ABN, First Publish Date - 2023-07-14T11:13:57+05:30

వచ్చే యేడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సి వ్యూహంపై నడ్డా, అన్నామలై(Nadda, Annamalai) కూలంకషంగా చర్చించారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జేపీ నడ్డాతో అన్నామలై భేటీ

- లోక్‌సభ ఎన్నికలపై కసరత్తుకు చర్చ

అడయార్‌(చెన్నై): వచ్చే యేడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సి వ్యూహంపై నడ్డా, అన్నామలై(Nadda, Annamalai) కూలంకషంగా చర్చించారా? వారి కలయిక అందుకేనన్నది విశ్వసనీయ సమాచారం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(K. Annamalai) గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. గవర్నర్‌ ఆరు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని చెన్నై వచ్చిన మరునాడే జాతీయ అధ్యక్షుడితో అన్నామలై భేటీ కావడం రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా ఈ భేటీలో వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలపై చర్చ జరిగినట్లు తెలిసింది. అదే విధంగా తమ కూటమి పార్టీ అయిన అన్నాడీఎంకేపై విమర్శలు చేయవద్దని నడ్డా హితవు పలికినట్టు సమాచారం. అదేవిధంగా తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ పురోగతి, అన్నాడీంకే - బీజేపీ(AIADMK - BJP) స్నేహ సంబంధాలు, డీఎంకే ప్రభుత్వం, గవర్నర్‌ ఆధిపత్య పోరు, మంత్రి సెంథిల్‌ బాలాజీ(Minister Senthil Balaji) అరెస్టు వ్యవహారం, డీఎంకే(DMK) మంత్రులు, కీలక నేతల ఆస్తుల చిట్టా విడుదల తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అన్నామలైకు జేపీ నడ్డా కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయనున్నామని, ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో జరుగనున్న ఎన్డీయే కూటమి భాగస్వామ్య పార్టీల సమావేశానికి అన్నాడీఎంకేను ఆహ్వానించినట్టు చెప్పారు. అందువల్ల అన్నాడీఎంకే నేతలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేయవద్దని సూచించినట్టు సమాచారం.

28 నుంచి అన్నామలై పాదయాత్ర

ఈ నెల 28న అన్నామలై పాదయాత్ర చేపట్టనున్నారు. ‘ఎన్‌ మణ్‌ - ఎన్‌ మక్కల్‌’ (నా మట్టి - నా ప్రజలు) అనే నినాదంతో ఆయన రామేశ్వరం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్రను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రకు రావాలని జేపీ నడ్డాని అన్నామలై ఆహ్వానించినట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2023-07-14T11:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising