ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP: ఆ ఇద్దరు మంత్రులను డిస్మిస్‌ చేయాల్సిందే..

ABN, First Publish Date - 2023-05-21T11:25:21+05:30

కల్తీసారాకు 22 మంది మృతి చెందడానికి కారణమైన ఇద్దరు మంత్రులను వెంటనే డిస్మిస్‌ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రెండు జిల్లాల్లో కల్తీసారాకు 22 మంది మృతి చెందడానికి కారణమైన ఇద్దరు మంత్రులను వెంటనే డిస్మిస్‌ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సారాను నిరోధించలేని డీఎంకే ప్రభుత్వాన్ని ఖండిస్తూ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. చెన్నైలో జరిగిన ధర్నాలో అన్నామలై పాల్గొని డీఎంకే ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం సారా ఏరులై పారుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. కనీసం మద్యం దుకాణాల సంఖ్యను కూడా తగ్గించకుండా యేటా రూ.50వేల కోట్ల మేరకు మద్యం విక్రయాలు జరగాలంటూ లక్ష్యం విధించిందని అన్నామలై ధ్వజమెత్తారు. విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కల్తీసారాకు 22 మంది ప్రాణాలు కోల్పోయినా డీఎంకే ప్రభుత్వం ఆ సంఘటనకు బాధ్యులైన మంత్రులు సెంథిల్‌బాలాజీ, సెంజి మస్తాన్‌(Ministers Senthilbalaji and Senji Mastan)కు పదవుల నుంచి తొలగించకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. ఆ ఇద్దరు మంత్రులను డిస్మిస్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చెన్నైలో జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రముఖ నటి నమితా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-21T11:25:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising