ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Siddaramaiah: మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్లాన్ ... సీఎం సంచలన ఆరోపణ

ABN, First Publish Date - 2023-10-29T15:49:11+05:30

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. అయితే బీజేపీ పన్నాగాలు విజయవంతం కావని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీని వదలి వెళ్లరని చెప్పారు.

బెంగళూరు: కర్ణాటక (Karnataka) లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆరోపించారు. అయితే బీజేపీ పన్నాగాలు విజయవంతం కావని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీని వదలి వెళ్లరని చెప్పారు.


''మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనేది నిజం. అయితే వారి పన్నాగాలు చెల్లవు. గతంలో మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ఈసారి అలాంటి పన్నాగాలకు పనిచేయవు. అధికారం కోసం వాళ్లు ఎంతదూరమైనా, ఏమి చేయడానికైనా సిద్ధపడతారనేది మాత్రం స్పష్టం. కానీ ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా మా పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లరు'' అని సిద్ధరామయ్య చెప్పారు. ఆపరేషన్ కమల పేరుతో దక్షిణ కర్ణాటకలో ఎమ్మెల్యేలకు ఎర చూపుతున్నారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎం తాజా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రతీదీ తమకు తెలుసునని, బాగా పలుగుబడి ఉన్న కొందరు వ్యక్తులు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ వ్యవహారాలపై ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయవద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తాను ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. కాగా, ఎమ్మెల్యేలను కొనుగులో చేసే అవసరం తమ పార్టీకి లేదని, కాంగ్రెస్‌లోనే సీఎం పదవి కోసం పోటీ ఆపరేషన్ నడుస్తోందని బీజేపీ నేత అశ్వధ్ నారాయణ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-10-29T15:49:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising