ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP-Congress: ఇప్పుడే మొదలైంది.. బీజేపీ ముఖ్య నేతలకు కాంగ్రెస్‌ గాలం?

ABN, First Publish Date - 2023-07-04T11:54:13+05:30

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 20కు పైగా నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలని గట్టిపట్టుతో ఉన్న కాంగ్రెస్‌ ఆ దిశగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 20కు పైగా నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలని గట్టిపట్టుతో ఉన్న కాంగ్రెస్‌ ఆ దిశగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రముఖ బీజేపీ నేతలకు గాలం వేస్తోంది. బీజేపీ అధిష్టానం పెద్దలు, రాష్ట్రంలోని కొందరు సీనియర్‌ నేతల తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న నేతలతో కాంగ్రెస్‌ నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిలో మాజీ సీఎం యడియూరప్పకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీ రేణుకాచార్య(MP Renukacharya), రాజుగౌడ, శంకరపాటిల్‌ మునేనకొప్ప, జేసీ మాధుస్వామి, ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్‌(MLA ST Somasekhar), కరడి సంగణ్ణ, బలహీనవర్గాల కమిషన్‌ చైర్మన్‌ జయప్రకాష్‌ హెగ్డే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు గాక ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లు దక్కకపోవచ్చునని గట్టిగా భావిస్తున్న సుమారు ఆరుగురు బీజేపీ ఎంపీలు కూడా కాంగ్రెస్‌ నేతలతో లోపాయికారిగా టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బీజేపీలో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమయమవుతుందన్న భయంతో ఉన్నవారికే కాంగ్రెస్‌ గాలం వేస్తోంది. వీరి చేరిక వల్ల ఆయా లోక్‌సభ నియోజకవర్గాల్లో కలిగే లాభనష్టాలపై కూడా కాంగ్రెస్‌ పెద్దలు బేరీజు వేస్తున్నారని తెలిసింది. కాగా బీజేపీని వీడి ఎవరూ వెళ్లబోరని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి పేర్కొన్నారు. నగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పార్టీకి తగిలిన దెబ్బలు తాత్కాలికమేనని, లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీ పూర్తిగా కోలుకుని సత్తాచాటుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-04T11:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising