ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు కేసులో అనుమానితుల గుర్తింపు

ABN, Publish Date - Dec 27 , 2023 | 09:18 AM

న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడు కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరు అనుమానితులను గుర్తించారు. అనుమానితుల కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ: న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడు కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరు అనుమానితులను గుర్తించారు. అనుమానితుల కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం సంభవించిన ఈ పేలుడులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు లేదు. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఇజ్రాయెల్ ఎంబసీ రాయబారిని ఉద్దేశించి టైప్ చేసిన లేఖ ఇజ్రాయెల్ జెండాతో చుట్టబడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను విమర్శిస్తూ ఆ లేఖ ఉంది. ఆంగ్లంలో రాసిన ఆ లేఖలో ఇది ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. కాగా ‘‘సర్ అల్లా రెసిస్టెన్స్’’ అనే సమూహం ఈ పేలుడుకు తామే బాధ్యులమని ప్రకటించింది.


పేలుడు సంభవించిన తర్వాత ఘటన ప్రాంతాన్ని పోలీసులు కొద్దిసేపు చుట్టుముట్టారు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ యధాస్థితికి చేరుకుంది. ఈ పేలుడు ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. పేలుడు సంభవించిన వెంటనే బాంబు స్క్వాడ్‌లు, ప్రత్యేక పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సోదాలు నిర్వహించాయి. అయితే ఘటనా స్థలంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం కూడా ఈ సంఘటనను ధృవీకరించింది. దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. "సాయంత్రం 5:08 గంటల ప్రాంతంలో రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించిందని మేము నిర్ధారించాం. ఢిల్లీ పోలీసులు, భద్రతా బృందం పరిస్థితిని పరిశీలిస్తున్నాయి" అని ఎంబసీ అధికార ప్రతినిధి గై నిర్ మంగళవారం సాయంత్రం తెలిపారు. కాగా ఈ ఘటనలో ఎంబసీ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 09:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising