ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chinese Pandas : పన్నెండేళ్లు ఎదురు చూసినా వారసురాలిని ఇవ్వని చైనా పాండాల జంట

ABN, First Publish Date - 2023-01-05T16:47:14+05:30

జెయింట్ పాండాల పరిరక్షణలో భాగంగా చైనా నుంచి తీసుకొచ్చిన రెండు పాండాలను తిరిగి చైనాకు ఇచ్చేయాలని

Chinese Giant Pandas
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : జెయింట్ పాండాల పరిరక్షణలో భాగంగా చైనా నుంచి తీసుకొచ్చిన రెండు పాండాలను తిరిగి చైనాకు ఇచ్చేయాలని స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరో జంతు ప్రదర్శనశాల (Edinburg Zoo) నిర్ణయించింది. పాండా పిల్లల ఉత్పత్తి కోసం ఈ ఆడ, మగ పాండాలను 2011 డిసెంబరులో తీసుకెళ్ళారు. మొదట్లో కుదిరిన ఒప్పందాన్ని మరో రెండేళ్ళపాటు పెంచారు. కానీ ఇవి సహజసిద్ధ వాతావరణం లేకపోవడంతో పిల్లలను ఉత్పత్తి చేయలేకపోయాయి. ఇక వీటిని తిరిగి చైనాకు పంపించేయాలని ఈ జంతు ప్రదర్శనశాల నిర్ణయించింది.

స్కాట్లాండ్ రాయల్ జూలాజికల్ సొసైటీ (RZSS) అధికారులు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, చైనా నుంచి తీసుకొచ్చిన యాంగ్ గ్వాంగ్ (Yang Guang -Sunshine), తియాన్ తియాన్ (Tian Tian - Sweetie) జెయింట్ పాండాలను ఈ ఏడాది అక్టోబరులో తిరిగి ఆ దేశానికి పంపించేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ జంతుప్రదర్శనశాలలో వీటికి ఘనంగా వీడ్కోలు పలుకుతామని చెప్పారు.

జెయింట్ పాండా జాతి పరిరక్షణ కోసం ఈ రెండు పాండాలను చైనా నుంచి ఎడిన్‌బరో జంతు ప్రదర్శనశాలకు తీసుకొచ్చారు. ఇవి 2011 డిసెంబరులో ఇక్కడికి వచ్చినప్పటికీ, ఇవి సంతానోత్పత్తికి ఆసక్తి చూపలేదు. చైనా వన్యప్రాణుల పరిరక్షణ సంఘంతో ఒప్పందం కుదుర్చుకుని వీటిని తీసుకొచ్చారు. మొదట్లో పదేళ్ళపాటు వీటిని ఈ జంతు ప్రదర్శనశాలలో ఉంచేందుకు ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత రెండేళ్లపాటు దీనిని పొడిగించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఈ రెండు పాండాలు సంతానోత్పత్తికి ఆసక్తి చూపడం లేదని గుర్తించిన అధికారులు 2013లో తియాన్ తియాన్‌కు కృత్రిమ గర్భధారణ చేయించేందుకు ప్రయత్నించి, విఫలమయ్యారు. ఆ తర్వాత యాంగ్ గ్వాంగ్‌కు టెస్టికల్ కేన్సర్ సోకడంతో దానికి విత్తులు కొట్టారు.

ఈ పాండాల జంట గొప్ప కీర్తి సంపాదించుకుంది. వాటి గౌరవార్థం ప్రత్యేకమైన టర్టాన్‌ను ఏర్పాటు చేశారు. దీనిని వాటి ఉన్ని రంగుల్లో తీర్చిదిద్దారు. నలుపు, తెలుపు, బూడిద రంగు, చైనాను గుర్తు చేసే ఎరుపు రంగుల్లో తీర్చిదిద్దారు.

ఈ జంతుప్రదర్శనశాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ ఫీల్డ్ మాట్లాడుతూ, ఈ పాండాల జంట వల్ల లక్షలాది మంది ప్రజలు ప్రకృతితో అనుబంధం ఏర్పరచుకున్నారన్నారు.

జెయింట్ పాండాలు నిర్బంధంలో ఉంటే సంతానోత్పత్తి పట్ల ఆసక్తి ప్రదర్శించవని పాండాస్ ఇంటర్నేషనల్ కన్సర్వేషన్ ఆర్గనైజేషన్ తెలిపింది. సహజంగా కలుసుకునే పరిస్థితులు లేకపోతే ఆడ, మగ సన్నిహితం కాబోవని పేర్కొంది. చలి కాలం, వేసవి కాలం మధ్యలో కేవలం 24 గంటల నుంచి 36 గంటల వరకు మాత్రమే ఆడ పాండా సంతానోత్పత్తికి అనువుగా ఉంటుందని తెలిపింది.

నైరుతి చైనాలో పాండాలు ఉంటాయి. ప్రస్తుతం 1,864 జెయింట్ పాండాస్ మాత్రమే ఉన్నాయని అంచనా. సుమారు 600 పాండాలు జంతు ప్రదర్శనశాలలు, పాండా సెంటర్స్ వంటివాటిలో నిర్బంధంలో ఉన్నాయని తెలుస్తోంది.

Updated Date - 2023-01-05T16:47:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising