Karnataka Bjp: మాజీ సీఎం తనయుడికి పార్టీ పగ్గాలు
ABN, First Publish Date - 2023-11-10T19:22:52+05:30
కర్ణాటక బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఆ పార్టీ అధిష్ఠానం శుక్రవారంనాడు ప్రకటించింది. పార్టీ దిగ్గజ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తనయుడు విజయేంద్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించింది.
బెంగళూరు: కర్ణాటక బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఆ పార్టీ అధిష్ఠానం శుక్రవారంనాడు ప్రకటించింది. పార్టీ దిగ్గజ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (BS Yadiyurappa) తనయుడు విజయేంద్ర (Vijayendra)ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. నళిన్‌కుమార్ కటీల్ స్థానంలో విజయేంద్ర కొత్త అధ్యక్షుడి పదవిలో నియమితులయ్యారు.
ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయేంద్ర గెలుపొందారు. 47 ఏళ్ల విజయేంద్ర తన తండ్రి యడియూరప్ప రాజకీయవారసుడిగా ఉన్నాయి. మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవిచూడటంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చనున్నారంటూ కొద్దికాలంలో ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. కాగా, యడియూరప్ప పెద్ద కుమారుడు బీవై రాఘవేంద్ర లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.
Updated Date - 2023-11-10T19:31:28+05:30 IST