ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sameer Wankhede: క్రూయిజ్ డ్రగ్స్ కేసులో సమీర్ వాంఖడేపై సీబీఐసీ చర్యలు

ABN, First Publish Date - 2023-05-20T13:53:50+05:30

అవినీతి ఆరోపణలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది... .

CBIC to take action against Sameer Wankhede
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (CBIC) చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.(Sameer Wankhede) సీబీఐసీ సమీర్ వాంఖడే అవినీతి ఆరోపణలపై చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.(CBIC to take action)డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో ఆర్యన్ ఖాన్ విడుదలకు బదులుగా నటుడు షారూఖ్ ఖాన్ నుంచి రూ.25 కోట్ల లంచం తీసుకునేందుకు ప్రయత్నించినట్లు వాంఖడేపై ఆరోపణలు వచ్చాయి.(Corruption charges)నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) విజిలెన్స్ నివేదికను సిబీఐసీతో పంచుకున్నారు.సమీర్ వాంఖడే షారుఖ్ ఖాన్‌తో జరిపిన ఛాటింగులను ఉదహరించారు.దీంతో సమీర్ ను చెన్నైలోని డిపార్ట్‌మెంట్ యొక్క టాక్స్ పేయర్స్ సర్వీస్ వింగ్‌కు బదిలీ చేశారు. ఎన్‌సీబీ విజిలెన్స్ నివేదికతో సహా వాంఖడేకు సంబంధించి మరికొన్ని క్రమశిక్షణాపరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయని సీబీఐసీ ఉన్నత వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి : School Jobs Scam Case: మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ను ప్రశ్నించిన సీబీఐ

ఎన్సీబీ విజిలెన్స్ నివేదికలో సమీర్ వాంఖడే అవినీతి, దుష్ప్రవర్తన,సీసీఎస్ నిబంధనల ఉల్లంఘన,అసమాన ఆస్తులకు సంబంధించిన అంశాలున్నాయి.వాంఖడేపై సీబీఐ నమోదు చేసినన కేసులో అవినీతి నిరోధక చట్టానికి సంబంధించిన సెక్షన్లను ప్రస్తావించారు.సీబీఐసీ క్రమశిక్షణా ప్రక్రియ పూర్తయిన తర్వాత డిపార్ట్‌మెంట్ నుంచి వాంఖడేపై సస్పెన్షన్ చేయవచ్చు.మాజీ ఎన్‌సిబి అధికారి సమీర్ వాంఖడేపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) విజిలెన్స్ నివేదిక ఆధారంగా సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది.ఆర్యన్ ఖాన్ కేసుకు సంబంధించి సమీర్ వాంఖడే, ఇతర అధికారులపై ఎన్‌సీబీ విజిలెన్స్ విచారణ ప్రారంభించింది.

Updated Date - 2023-05-20T13:55:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising