ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Excise Policy: కోర్టుల ముందు అబద్దాలు చెబుతున్న దర్యాప్తు సంస్థలు.. సీబీఐ సమన్లపై కేజ్రీవాల్

ABN, First Publish Date - 2023-04-15T14:29:23+05:30

అవినీతికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడే సీబీఐ సమన్లు పంపుతుందనే విషయం తనకు తెలుసునని... ఢిల్లీ ముఖ్యమంత్రి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడే సీబీఐ సమన్లు పంపుతుందనే విషయం తనకు తెలుసునని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శనివారంనాడు అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ సమన్లు పంపిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మద్యం పాలసీ దర్యాప్తునకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టులో తమపై అబద్ధాలు చెబుతున్నాయని ఆరోపించారు. అరెస్టు చేసిన వ్యక్తులను చిత్రహింసలు పెడుతూ, వారిపై ఒత్తిడి పెంచడం ద్వారా తమను ఇరుకునపెట్టేందుకు చూస్తున్నాయని అన్నారు. మద్యం విదానంలో మనీష్ సిసిడియాపై సీబీఐ తప్పుడు ఆరోపణలు చేసిందని, అబద్ధపు స్టేట్‌మెంట్లు ఇవ్వాలంటూ సాక్షులను చితకబాదుతున్నారని, అవినీతి నిర్మూలించే గొప్ప విధానం ఇదే కావచ్చునని ఆయన విమర్శలు గుప్పించారు.

నేనే అవినీతిపరుడనైతే...

సీబీఐ తనను ఆదివారంనాడు హాజరుకావాలని పిలిచిందని, తప్పనిసరిగా హాజరవుతానని కేజ్రీవాల్ చెప్పారు. ''అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపరుడైతే ఈ ప్రపంచంలో నిజాయితీపరుడు ఇంకెవరుంటారు? నన్ను అరెస్టు చేయమని బీజేపీ చెబితే, ఆ ఆదేశాలను సీబీఐ తు.చ. తప్పకుండా పాటిస్తుంది'' అని కేజ్రీవాల్ అన్నారు.

ఢిల్లీ మద్యం కేసులో ఈనెల 16వ తేదీన తమ ముందు హాజరుకావాలంటూ కేజ్రీవాల్‌కు సీబీఐ శుక్రవారంనాడు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఆప్‌ నేత సిసోడియా, విజయ్‌ నాయర్‌ సహా పలువురు జైలులో ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్‌ జాతీయ హోదా కల్పించిన అనంతరం ఇక పార్టీ నేతలంతా జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని కేజ్రీవాల్‌ పేర్కొనడం, ఆయన అలా వ్యాఖ్యానించిన రెండ్రోజులకే మద్యం కుంభకోణం కేసులో సీబీఐ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశవుతోంది. కాగా, సీబీఐ సమన్లు పంపినంత మాత్రాన అవినీతిపై కేజ్రీవాల్‌ పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ సింగ్‌ తెలిపారు.

Updated Date - 2023-04-15T14:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising