Central bank: సెప్టెంబర్30 డెడ్‌లైన్ తర్వాత రూ.2,000 నోట్లు ఏమవుతాయంటే..
ABN, First Publish Date - 2023-05-23T22:32:35+05:30
నోట్ల మార్పిడి గడువు ముగిశాఖ ప్రజల దగ్గర ఉన్న రూ. 2వేల నోట్ల పరిస్థితి ఏంటని సందేహాలు వ్యక్తమవతున్నాయి. సెప్టెంబర్ 30 తర్వాత బ్యాంకుల్లో రూ. 2వేల నోట్లను అంగీకరించకపోవచ్చని, నోట్లను మార్చుకునేందుకు సెంట్రల్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవలసి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ:ఇటీవల రూ.2వేల నోట్లను రద్దుచేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల దగ్గర ఉన్న రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అయితే రూ.2వేల నోట్ల రద్దుతో ప్రజల్లో చాలా సందేహాలు తలెత్తాయి. తాజాగా నోట్ల మార్పిడి గడువు ముగిశాఖ ప్రజల దగ్గర ఉన్న రూ. 2వేల నోట్ల పరిస్థితి ఏంటని సందేహాలు వ్యక్తమవతున్నాయి. సెప్టెంబర్ 30 తర్వాత బ్యాంకుల్లో రూ. 2వేల నోట్లను అంగీకరించకపోవచ్చని, నోట్లను మార్చుకునేందుకు సెంట్రల్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవలసి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసిన రూ.2వేల నోట్ల మార్పిడి ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. 2016లో రూ.500, రూ.1,000 నోట్ల డీమోనిటైజేషన్ మాదిరిగా కాకుండా, ₹ 2,000 నోట్లు చెల్లుబాటు అయ్యే టెండర్‌గా కొనసాగుతుందని సెంట్రల్ బ్యాంకు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి పబ్లిక్ లావాదేవీలకు కూడా ఉపయోగించవచ్చని పేర్కొన్నాయి. అయితే బ్యాంకులు డిపాజిట్, మార్పిడి కోసం వాటిని అంగీకరించకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాయి.
రూ. 2,000 నోట్లను మార్చుకోవడానికి ఎటువంటి స్లిప్ అవసరం లేదని, మొత్తం విలువ రూ. 20,000 వరకు ఒకేసారి మార్చుకోవచ్చని సెంట్రల్ బ్యాంక్ శనివారం స్పష్టం చేసింది. క్లీన్ నోట్ పాలసీ కింద నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది.
అయితే రూ.2,000 నోట్ల రద్దుతో ఢిల్లీలో గందరగోళం ఏర్పడింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకుల ముందు పొడవాటి క్యూలు దర్శనమిచ్చాయి. కాకపోతే భారీ మొత్తంలో నోట్ల మార్పిడి జరగలేదని తెలుస్తోంది. కొన్ని బ్యాంకులు నోట్లను మార్చుకోవడానికి నిరాకరించాయని, తమ గుర్తింపు కార్డులను డిమాండ్ చేయడంతో పాటు వాటిని డిపాజిట్ చేయాలని బ్యాంకు సిబ్బంది కోరినట్లు ప్రజలు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2023-05-23T22:32:35+05:30 IST