ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

One Nation-One Election : ఉన్నతాధికారులకు కేంద్రం కీలక ఆదేశాలు

ABN, First Publish Date - 2023-09-01T13:32:30+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్ సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.

Narendra Modi

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్ సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నందువల్ల ఈరోజుల్లో ఢిల్లీ నగరంలోనే ఉండాలని ప్రభుత్వం వీరిని ఆదేశించింది.

కేబినెట్ కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఢిల్లీలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన మంత్రి కార్యాలయం అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లరాదని తెలిపింది.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరుగుతాయని తెలిపారు. 17వ లోక్ సభలో 13వ సెషన్, రాజ్య సభ 261వ సెషన్ జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాల్లో ఐదు సిట్టింగ్స్ ఉంటాయన్నారు. అమృత కాలంలో పార్లమెంటులో సత్ఫలితాలిచ్చే చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.


ఆమోదం ఎలా?

‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది ఎంపీలు మద్దతు ఇవ్వాలి. అదేవిధంగా దేశంలోని 50 శాతానికిపైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. అయితే ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేదని కొందరు చెప్తున్నారు.

గతంలో..

1967 వరకు లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ ఉండేవి. 1968-69లో కొన్ని రాష్ట్రాల శాసన సభలను పదవీ కాలం ముగియక మునుపే రద్దు చేయడంతో ఈ విధానానికి గండిపడింది. అదే విధంగా లోక్ సభ పదవీ కాలం ముగియడానికి ఒక ఏడాది ముందే రద్దు చేసి, 1971లో మధ్యంతర ఎన్నికలను నిర్వహించారు.

బీజేపీ మేనిఫెస్టోలో..

2014 లోక్ సభ ఎన్నికల ప్రణాళికలో బీజేపీ ఇచ్చిన హామీల్లో ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కూడా ఉంది. నేరగాళ్లను నిర్మూలించేందుకు ఎన్నికల సంస్కరణలను తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం వల్ల రాజకీయ పార్టీలతోపాటు ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా స్థిరత్వం లభిస్తుందని తెలిపింది.


ఇవి కూడా చదవండి :

Bomb Threat : ‘తాజ్ హోటల్‌ను ఇద్దరు పాకిస్థానీలు పేల్చేస్తారు’.. ముంబై పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్..

One Nation-One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం కేంద్రం మరో ముందడుగు

Updated Date - 2023-09-01T13:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising