ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ban on Apps: 14 యాప్‌లను బ్లాక్ చేసిన మోదీ సర్కార్... ఆ యాప్స్ వల్ల ఏం జరుగుతుందో తెలుసా...

ABN, First Publish Date - 2023-05-01T15:14:28+05:30

ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central govt) సంచలన నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central govt) సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్‌లోని ఉగ్ర మూకలతో సంభాషణ కోసం ఉపయోగిస్తున్నారని అనుమానిస్తున్న 14 మొబైల్ మెసేజింగ్ యాప్స్‌పై (ban on 14 apps) నిషేధం విధించింది. క్రిప్‌వైసర్, ఎనిగ్మా, సేఫ్‌స్విస్, విక్‌మే, మీడియాఫైర్, బ్రియార్, బీచాట్, నాండ్‌బాక్స్, కొనియన్, ఐఎంవో, ఎలిమింట్, సెకండ్ లైన్, జంగీ, త్రీమా నిషేధిత యాప్స్‌ జాబితాలో ఉన్నాయి. వీటన్నింటినీ కేంద్రం బ్లాక్ చేసింది. ఉగ్రవాదులు ఈ యాప్‌లను జమ్ముకాశ్మీర్‌లో ఎక్కువగా వాడుతున్నారు. తమ మద్ధతుదారులతోపాటు ఓజీడబ్ల్యూతో (ఓవర్ గ్రౌండ్ వర్కర్స్) సంభాషణల కోసం వీటిని వాడుతున్నారనే అనుమానాలున్నాయి. పాకిస్తాన్‌ కేంద్రంగా నడిచే ఉగ్రవాద సంస్థలు, గ్రూపుల నుంచి సమాచారం కోసం కాశ్మీర్‌లో ఉగ్రవాదులు వీటిని వాడుతున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సెక్యూరిటీ, ఇంటెలిజెన్సీ సంస్థల సిఫార్సులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించాయి. ఈ 14 యాప్‌లు జాతీయ భద్రతకు హానికరమని, వీటిని రూపొందించే సమయంలో భారతీయ చట్టాలను పాటించలేదని ఓ అధికారి పేర్కొన్నారు. నిషేధం విధించాలంటూ సంబంధిత మంత్రిత్వశాఖకు విజ్ఞప్తులు రావడంతో ఈ చర్యకు పూనుకున్నట్టు వివరించారు. ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69ఏ కింద ఈ యాప్స్‌ను బ్లాక్ చేసినట్టు సదరు అధికారి వివరించారు.

జమ్ముకాశ్మీర్ వ్యాలీలో ఈ యాప్స్ ఉగ్రవాద భావజాలం వ్యాప్తికి దోహదపడుతున్నాయని ఉన్నతాధికారులను సంప్రదించగా వెల్లడించారు. ఓజీడబ్ల్యూ (OGW) ఉపయోగించే ప్రతి మార్గాన్ని ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తూనే ఉంటాయన వివరించారు. ఇలాంటి యాప్‌లపు పర్యవేక్షిస్తుండగా ఒక యాప్‌కు భారత్‌లో కనీసం ప్రతినిధి కూడా లేదని తెలిసింది. ఈ కారణంగా యాప్‌పై జరిగే కార్యకలాపాలను గుర్తించడం కష్టమని ఓ జాతీయ మీడియా సంస్థకు ఒక అధికారి వివరించారు.

ఇవి కూడా చదవండి..

SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టిన బ్యాంక్..

Reliance Jio: రిలయన్స్ జియో గుడ్‌న్యూస్!.. త్వరలోనే వైర్లు లేకుండానే...

Updated Date - 2023-05-01T16:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising