ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur Horror Video: మణిపూర్‌లో నగ్నంగా మహిళల ఊరేగింపు, అత్యాచారం ఘటనలో కీలక పరిణామం.. కేంద్రం కీలక ఆదేశాలు!

ABN, First Publish Date - 2023-07-27T20:34:45+05:30

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన మణిపూర్‌ మహిళల నగ్నంగా ఊరేగించి, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆదేశించింది.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన మణిపూర్‌ మహిళల నగ్నంగా ఊరేగింపు, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆదేశించింది. నిందితులకు శిక్ష పడేలా చూడాలని సీబీఐని కోరింది. అంతేకాదు.. ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన విచారణను మణిపూర్‌ వెలుపల నిర్వహించాలని ఆదేశించింది. మణిపూర్‌లో ఇంకా అల్లర్లు కొనసాగుతున్న నేపథ్యంలో విచారణకు అంతరాయం కలగొచ్చన్న ఉద్దేశంతో కేంద్రం ఈ మేరకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా.. మణిపూర్‌ హింసలో భాగంగా కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలపై మైతేయీ వర్గంవారు వికృతి చేష్టకు పాల్పడిన తీరుతో భారత్‌తోపాటు ప్రపంచదేశాలు సైతం నివ్వెరపోయాయి. నగ్నంగా ఊరేగింపు, అత్యాచారం ఘటన దాదాపు మూడు నెలల తర్వాత ఒక వీడియో రూపంలో వెలుగులోకి రావడం.. అది కాస్తా వైరల్‌గా మారడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పుడు గానీ ఈ కేసు ముందుకు కదలలేదు. ఈ దారుణమైన పనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. సర్వత్రా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.


ఇదిలావుండగా.. మణిపూర్ అల్లర్లకు కారణం, రెండు వర్గాల మధ్య వైరమే! ఎస్సీ, ఓబీసీ హోదాతో ఉన్న మైతేయీ తెగ వారు.. నాగా, కుకీ తరహాలోనే తమకూ ఎస్సీ హోదా కావాలని 2012 నుంచి డిమాండ్ చేస్తున్నారు. 53 శాతంగా ఉన్న మైటీ ప్రజల చేతుల్లో కేవలం 10 శాతం మాత్రమే భూమి ఉండగా.. 47 శాతం ఉన్న నాగా, కుకీల చేతుల్లో 90 శాతం భూమి (కొండ ప్రాంతం) ఉంది. మైతేయులు కూడా కొండ ప్రాంతాలకు విస్తరించాలని అనుకుంటున్నారు. కానీ.. ప్రస్తుత చట్టాల ప్రకారం ఎస్టీ హోదా ఉన్నవారే కొండ ప్రాంతాల్లో భూములు కొనాలి. అందుకే.. తమకు ఎస్టీ హోదా కల్పించాలని మైతేయులు ఉద్యమిస్తున్నారు. దీన్ని నాగా, కుకీలు వ్యతిరేకిస్తుండడంతో.. గత మూడు నెలల నుంచి మణిపూర్ భగ్గుమంటోంది.

Updated Date - 2023-07-27T20:47:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising