Manipur : నగ్నంగా మణిపూర్ మహిళల ఊరేగింపు.. వీడియోను తొలగించాలని ట్విటర్‌కు ఆదేశం..
ABN, First Publish Date - 2023-07-20T10:11:13+05:30
మణిపూర్‌లో మెయిటీ, కుకీ జాతుల మధ్య హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో ట్విటర్‌లో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నందువల్ల ఈ వీడియోను తొలగించాలని ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
న్యూఢిల్లీ : మణిపూర్‌లో మెయిటీ, కుకీ జాతుల మధ్య హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో ట్విటర్‌లో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నందువల్ల ఈ వీడియోను తొలగించాలని ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. భారత దేశంలో కార్యకలాపాలను నిర్వహించే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ దేశంలో అమలవుతున్న చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ సంఘటనపై స్పందిస్తూ, తాను అమానుషమైన, దిగ్భ్రాంతికరమైన వీడియోను చూశానని, వెంటనే మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్‌తో మాట్లాడానని చెప్పారు. అదే విధంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్, శివసేన (యూబీటీ) నేతలు ఆదిత్య థాకరే, ప్రియాంక చతుర్వేది, టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, సాకేత్ గోఖలే ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. మే 3 నుంచి హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది ఇచ్చిన ట్వీట్‌లో, సామాజిక మాధ్యమాలను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం నైరాశ్యానికి నిదర్శనమని తెలిపారు. హింసను, బూటకపు వార్తలను కట్టడి చేయడంలో ప్రభుత్వ అసమర్థతను ఇది వెల్లడిస్తోందన్నారు.
మెయిటీలు, కుకీల మధ్య ఘర్షణలు ప్రారంభమైన రోజు నుంచి మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఇద్దరు కుకీ మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో బుధవారం బయటపడటంతో అందరూ ఖండిస్తున్నారు. ఈ బాధిత మహిళలపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కొందరు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి :
President: 6, 7 తేదీల్లో పుదుచ్చేరికి రాష్ట్రపతి
Manipur : మణిపూర్‌లో అంతర్యుద్ధం.. భారత్‌ను బీజేపీ ఏ స్థాయికి దిగజార్చింది?.. టీఎంసీ
Updated Date - 2023-07-20T10:11:13+05:30 IST