Apple : ఆపిల్స్ దిగుమతులపై కేంద్రం నిషేధాస్త్రం

ABN, First Publish Date - 2023-05-09T07:17:21+05:30

ఆపిల్స్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

Apple : ఆపిల్స్ దిగుమతులపై కేంద్రం నిషేధాస్త్రం
Centre Bans Apple Imports
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆపిల్స్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిలో 50రూపాయల కంటే తక్కువ ధరకు దిగుమతి చేసుకున్న ఆపిల్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.(Centre Bans)బీమా, రవాణ ఖర్చులతో కలిపి ఆపిల్స్ కిలో ధర 50 రూపాయల కంటే తక్కువ ఉంటే వాటి దిగుమతిని నిషేధిస్తున్నట్లు(Apple Imports) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా భూటాన్ దేశం నుంచి ఆపిల్స్ దిగుమతులకు కనీస దిగుమతి ధర నిబంధన వర్తించదు.

ఈ ఏడాది భారతదేశం 296 మిలియన్ డాలర్ల విలువైన ఆపిల్స్ పండ్లను దిగుమతి చేసుకుంది. అమెరికా, ఇరాన్, బ్రెజిల్, యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్, బెల్జియం, చిలీ, ఇటలీ, టర్కీ, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పోలాండ్‌లు భారత్‌కు ఆపిల్స్‌ను ఎగుమతి చేసే ప్రధాన దేశాలు.దక్షిణాఫ్రికా నుంచి ఆపిల్స్ దిగుమతులు ఎక్కువ.పోలాండ్ దేశం నుంచి ఆపిల్ దిగుమతులు పెరగ్గా, అమెరికా, యూఏఈ, ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల నుంచి దిగుమతులు తగ్గాయి.

Updated Date - 2023-05-09T10:13:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising