Jammu kashmir: అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీకి కేంద్రం జడ్ ప్లస్ భద్రత
ABN, First Publish Date - 2023-04-05T10:57:28+05:30
జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీకి కేంద్రం జడ్ ప్లస్ కేటగిరి కింద సెంట్రల్ రిజర్వ్ పోలీసుఫోర్స్ భద్రతను కల్పిస్తూ...
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీకి కేంద్రం జడ్ ప్లస్ కేటగిరి కింద సెంట్రల్ రిజర్వ్ పోలీసుఫోర్స్ భద్రతను కల్పిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.(Apni Party president Altaf Bukhari) గతంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడైన అల్తాఫ్ కొత్తగా జమ్మూకశ్మీరులో అప్నీ పార్టీని స్థాపించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అందించిన సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ అల్తాఫ్ కు జడ్ ప్లస్ కేటగిరి భద్రత(Z plus security cover) కల్పించారు. వ్యాపారవేత్త నుంచి రాజకీయ నాయకుడి మారి మంత్రిగా కూడా పనిచేసిన అల్తాఫ్ కు 65 ఏళ్ల వయసు. అప్నీ పార్టీలో ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి పలువురు ప్రజాప్రతినిధులు చేరారు.
ఇది కూడ చదవండి : Most Wanted Gangster: మెక్సికోలో దీపక్ అరెస్ట్...భారతదేశానికి తరలింపు
జమ్మూకశ్మీరులో భూమి హక్కులు, ఉద్యోగాల కల్పన విషయంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని అప్నీ పార్టీ అధినేత అల్తాఫ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి విన్నవించారు. గత ఏడాది అల్తాఫ్ శ్రీనగర్ లో భారీ ర్యాలీ జరిపారు.బీజేపీతో తాము ఎన్నికల పొత్తు పెట్టుకుంటామని అల్తాఫ్ బుఖారీ గతంలో చెప్పారు. దీంతో కేంద్రం అల్తాఫ్ కు జడ్ ప్లస్ భద్రతను(Centre provides) కేటాయిస్తూ బుధవారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Updated Date - 2023-04-05T10:57:28+05:30 IST