Chhattisgarh : మేం అధికారం చేపడితే బుల్డోజర్లతో మాఫియాను అంతం చేస్తాం : బీజేపీ నేత
ABN, First Publish Date - 2023-08-17T12:23:55+05:30
అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉన్నారని ఆ పార్టీ ఛత్తీస్‌గఢ్ శాఖ అధ్యక్షుడు అరుణ్ సావో (Arun Sao) చెప్పారు. రాష్ట్రంలోని అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు.
రాయ్‌పూర్ : అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉన్నారని ఆ పార్టీ ఛత్తీస్‌గఢ్ శాఖ అధ్యక్షుడు అరుణ్ సావో (Arun Sao) చెప్పారు. రాష్ట్రంలోని అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. శాసన సభ ఎన్నికల అనంతరం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నవారిపైనా, నేరాలకు పాల్పడేవారిపైనా బుల్డోజర్లను ఉపయోగిస్తామని హెచ్చరించారు.
అరుణ్ సావో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రవాది సంఘం నేతలు ఆయనను సత్కరించారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయానికి బుల్డోజర్లతో వచ్చి, బుల్డోజర్లతో ఆయనపై పూల వర్షం కురిపించి, అభినందించారు.
ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపడితే, నేరగాళ్లు, మాఫియాలను శిక్షిస్తామని చెప్పారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. శాసన సభ ఎన్నికల అనంతరం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నవారిపైనా, నేరాలకు పాల్పడేవారిపైనా బుల్డోజర్లను ఉపయోగిస్తామని హెచ్చరించారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ స్పందిస్తూ, రమణ్ సింగ్ నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వం అవినీతిమయమని, ముందుగా ఆ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినవారిపైకి బుల్డోజర్‌ను పంపించడం గురించి బీజేపీ నేతలు ఆలోచించాలని హితవు పలికారు. బుల్డోజర్‌తో శిక్షించడంపై తమకు నమ్మకం లేదన్నారు. చట్టం పట్ల కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉందన్నారు. తన రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు ఉన్నాయని, చట్టం అమలవుతోందని చెప్పారు. బీజేపీ హింస, విద్వేషం ఆధారంగా రాజకీయాలు చేస్తుందన్నారు. ప్రజలను రెచ్చగొట్టడానికి ఎంతకైనా తెగిస్తుందన్నారు.
ఛత్తీస్‌గఢ్ శాసన సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగబోతున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Flesh-eating bacteria : ఒంట్లో మాంసాన్ని తినేసే బాక్టీరియా.. ముగ్గురి మృతి..
Fact Check : ఇస్రో శాస్త్రవేత్తలకు జీతాలివ్వడం లేదా?
Updated Date - 2023-08-17T12:23:55+05:30 IST