ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: నేడు కావేరీ నిర్వాహక మండలి సమావేశం

ABN, First Publish Date - 2023-10-11T07:30:04+05:30

కావేరి నిర్వాహక మండలి సమావేశం ఈనెల 11న బుఽధవారం ఢిల్లీలో జరగనుంది. కావేరీ జలాల పంపిణీ అంశంలో రాష్ట్ర శాసనసభలో

అడయార్‌(చెన్నై): కావేరి నిర్వాహక మండలి సమావేశం ఈనెల 11న బుఽధవారం ఢిల్లీలో జరగనుంది. కావేరీ జలాల పంపిణీ అంశంలో రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ప్రభుత్వం తీర్మానం చేసి ఆమోదించింది. ఈ తరుణంలో కావేరీ నిర్వాహక మండలి నేడు హస్తినలో భేటీకానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి హాజరయ్యే అధికారులు... కర్ణాటక(Karnataka) రాష్ట్రాల్లోని జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు, ఆ రాష్ట్రంలోని నమోదైన వర్షపాతంతో పాటు కావేరీ జలాల నిర్వాహక మండలి ఆదేశాలను కర్నాటక ప్రభుత్వం ధిక్కరించిన వ్యవహారం తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. ఇటీవల సమావేశమైన కావేరీ జలాల నిర్వాహక మండలి తమిళనాడు రాష్ట్రానికి సెకనుకు 3 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, కర్ణాటక ప్రభుత్వం ఈ ఆదేశాలను తుంగలో తొక్కి.. ఈ ఆదేశాలను పునఃసమీక్షించాలని కోరింది. ఈ నేపథ్యంలో కావేరీ జలాల నిర్వాహక మండలి ఆదేశాలు ఈనెల 15వ తేదీతో ఆ గడువు ముగియనున్నాయి. దీంతో బుధవారం ఈ మండలి సమావేశమై తాజా పరిణామాలపై చర్చించనుంది. ఇందులో పాల్గొనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇరు రాష్ట్రాల్లోని జలాశయాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను మండలి సభ్యులకు వివరించనున్నారు. అదేవిధంగా మెకెదాటు ఆనకట్ట అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఆ అంశాన్ని ప్రస్తావించకూడదని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తుంది.

Updated Date - 2023-10-11T07:30:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising