Chennai: ముఖ్యమంత్రి సోదరునికి తీవ్ర అస్వస్థత
ABN, First Publish Date - 2023-07-30T10:24:01+05:30
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు, ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) సోదరుడు ఎంకే ముత్తు(MK Muthu) అస్వస్థత
ప్యారీస్(చెన్నై): రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు, ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) సోదరుడు ఎంకే ముత్తు(MK Muthu) అస్వస్థత కారణంగా స్థానిక ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరి ఆసుపత్రి(Kaveri Hospital)లో చికిత్స పొందుతున్నారు. కరుణానిధి మొద టి భార్య పద్మావతి దంపతులకు జన్మించిన ఎంకే ముత్తు (75) ‘పిల్లయో పిల్లయ్’, ‘పూకారి’, ‘సమయల్ కారన్’, ‘అనయా విళక్కు’, ‘నంబికై నచ్చత్రం’ తదితర సిని మాల్లో హీరోగా నటించారు. వృద్ధాప్యం కారణంగా ప్రస్తుతం ఎంకే ముత్తు అస్వ స్థతకు గురయ్యారు. అందువల్ల కుటుంబసభ్యులు ఆయన్ను ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు వైద్యుల బృందం చికిత్సలందిస్తోందని కుమారుడు అరివునిధి, కుమార్తె తేన్‌మొళి శనివారం మీడియాకు తెలిపారు.
Updated Date - 2023-07-30T10:26:04+05:30 IST