ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: ఢిల్లీలో అన్నాడీఎంకే సీనియర్‌ నేతల మకాం

ABN, First Publish Date - 2023-09-23T08:10:19+05:30

అన్నాడీఎంకే - బీజేపీ(AIADMK - BJP) మధ్య తలెత్తుతున్న మాటల యుద్ధం ఢిల్లీకి చేరింది. కొచ్చిన్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన అన్నాడీఎంకే సీనియర్‌

- అమిత్‌షాను కలిసేందుకు యత్నం!

పెరంబూర్‌(చెన్నై): అన్నాడీఎంకే - బీజేపీ(AIADMK - BJP) మధ్య తలెత్తుతున్న మాటల యుద్ధం ఢిల్లీకి చేరింది. కొచ్చిన్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్‌, సీవీ షణ్ముగం, వేలుమణి, తంగమణి... అమిత్‌షాను కలవనున్నట్లు సమాచారం. ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నాదురైపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వాటిని అన్నాడీఎంకే నేతలు ఖండించారు. రాష్ట్రంలో బీజీపీతో పొత్తు లేదని మాజీ మంత్రి జయకుమార్‌, అన్నాదురై గురించి మాట్లాడితే నాలుక కోస్తామంటూ మరో మాజీ మంత్రి సెల్లూరు రాజు వ్యాఖ్యానించారు. వీటికి బీజేపీ నేతలు కూడా దీటుగా బదులిచ్చారు. అనంతరం ఈ వ్యవహారంపై అన్నామలై మాట్లాడుతూ, అన్నాడీఎంకే - బీజేపీ మధ్య ఎలాంటి సమస్యలు లేవన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడప్పాడిని ప్రకటించే అంశం పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని పేర్కొన్న అన్నామలై.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్మమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకేకి చెందిన ఐదుగురు సీనియర్‌ నేతలు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. వారు అమిత్‌షాను కలసి అన్నామలైపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. గతంలో జయలలిత గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్నామలై, ఇప్పుడు అన్నాదురై గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదని, మళ్లీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలకు అన్నామలై స్వస్తి పలికేలా అధిష్ఠానం సూచించాలని వారు అమిత్‌షాను కోరనున్నట్లు సమాచారం.

Updated Date - 2023-09-23T08:10:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising