ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: మాజీసీఎం పేరు ప్రస్తావించొద్దు.. ఉదయనిధికి హైకోర్టు ఆదేశం

ABN, First Publish Date - 2023-09-22T09:37:20+05:30

కొడనాడు హత్య, దోపిడీ కేసుతో మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి(Former CM Edappadi Palaniswami) పేరు జోడిస్తూ ప్రస్తావించరాదని

పెరంబూర్‌(చెన్నై): కొడనాడు హత్య, దోపిడీ కేసుతో మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి(Former CM Edappadi Palaniswami) పేరు జోడిస్తూ ప్రస్తావించరాదని మద్రాస్‌ హైకోర్టు రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)ని ఆదేశించింది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మంజుల గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘సనాతనం అంటే ఏమిటి’ అంటే ఏమిటో తెలుసుకొనేందుకు ఇంట్లోని బీరువాలో ఉంచిన పుస్తకాలు వెతుకుతున్న ఎడప్పాడి పళనిస్వామి.. కొడనాడు హత్య, దోపిడీ కేసు నుంచి తప్పించుకొనేందుకు మేక చాటున దాక్కొన్నారు. ఆ మేక అదృశ్యమైతే మీ పరిస్థితి ఏమిటో తెలుసుకోండి’ అంటూ మంత్రి ఉదయనిధి ఈ నెల 7వ తేదీన చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కోరుతూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిని పళనిస్వామి హైకోర్టును ఆశ్రయించారు. కొడనాడు కేసులో తన పేరు ప్రస్తావించకుండా ఆదేశాలు జారీ చేయాలని, తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు 1.10 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరగ్గా.. మంత్రి ఉదయనిధి తరఫున న్యాయవాది హాజరు కాలేదు. దీంతో పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2023-09-22T09:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising