ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: మంత్రి సెంథిల్‌బాలాజి వ్యవహారంపై అమిత్‌షాతో గవర్నర్‌ చర్చ

ABN, First Publish Date - 2023-07-09T09:02:16+05:30

ఏడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) శనివారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఏడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) శనివారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో(Amit Shah) భేటీ అయ్యారు. అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థిల గురించి గవర్నర్‌ వివరించినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా ఇటీవల సెంథిల్‌ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించిన వ్యవహారంపై అమిత్‌షాకు గవర్నర్‌ వివరణ ఇచ్చినట్లు సమాచారం. మంత్రిని డిస్మిస్‌ చేస్తూ తాను ఇచ్చిన ఉత్తర్వులు.. ఆనక ప్రభుత్వం నుంచి వచ్చిన తీవ్ర స్పందన, ప్రజల్లో రేకెత్తిన నిరసనలతో నిలుపుదల చేసిన విధానంపై అమిత్‌షాకు వివరించినట్లు తెలిసింది. అంతేగాక ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) తనను గడ్చిపోచకన్నా హీనంగా తీసివేసేలా మాట్లాడుతున్నారని, డీఎంకే కార్యకర్తలతో పాటు ప్రజల్లోనూ తన పట్ల వ్యతిరేకత రేగేలా ఆయప వ్యాఖ్యలు ఉంటున్నాయని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తాను ఏం మాట్లాడినా అందులో తప్పుని ఎత్తి చూపుతూ డీఎంకే నేతలు విరుచుకుపడుతున్నారని, అంతేగాక తనను రాష్ట్రానికి శత్రువుగా ముద్రవేసే చర్యలు ఊపందుకున్నాయని వాపోయినట్లు తెలిసింది. సాక్షాత్తు ముఖ్యమంత్రే తన తీరు రాష్ట్రానికి వ్యతిరేకిలా ఉందని బహిరంగంగానే ప్రకటించారని వివరించారు. రాష్ట్ర అధికార యంత్రాంగం సైతం తనను ఏమాత్రం లెక్క చేయడం లేదని, కేవలం మొక్కుబడిగానే గౌరవమర్యాదలు ప్రదర్శిస్తున్నారని గవర్నర్‌ పేర్కొన్నారు. అన్నింటినీ అమిత్‌షా శ్రద్ధగా ఆలకించినట్లు సమాచారం. అనంతరం మునుముందు వ్యవహరించాల్సిన తీరుపైనా ఆయన కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. మంత్రి డిస్మిస్‌ వ్యవహారం న్యాయస్థానాల్లో నిలవదని, అందువల్ల తొందరపాటు ప్రదర్శించవద్దని గవర్నర్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. తప్పును సరిదిద్దే చర్యలు తీసుకున్నప్పటికీ, అవి కేంద్రం చేయించిందన్న తరహాలో ఉండరాదని పేర్కొన్నట్లు తెలిసింది. ఇదిలా వుండగా గవర్నర్‌ రవి సోమవారం అటార్నీ జనరల్‌తో భేటీ కానున్నట్లు తెలిసింది. సెంథిల్‌ బాలాజి వ్యవహారంపై ఆయనతో చర్చించి, సూచనలు తీసుకోనున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2023-07-09T09:02:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising