ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: గవర్నర్‌ x సీఎం

ABN, First Publish Date - 2023-07-01T07:39:44+05:30

గవర్నర్‌ - ముఖ్యమంత్రి పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకున్నారు. మీ మాటలు హద్దు మీరాయని సీఎంను గవర్నర్‌(Governor) తప్పుబట్టగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- లేఖాస్త్రాల ప్రయోగం

- మీ మాటలు హద్దు మీరాయ్‌ : గవర్నర్‌

- మీ లేఖలు అమర్యాదకరం: సీఎం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ - ముఖ్యమంత్రి పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకున్నారు. మీ మాటలు హద్దు మీరాయని సీఎంను గవర్నర్‌(Governor) తప్పుబట్టగా, మీ లేఖలు అమర్యాదకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. గతంలో ఏదో ఒక బహిరంగ వేదికలపై పరోక్షంగానో, సంక్షిప్తంగానో విమర్శలు గుప్పించుకున్న ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు ఏకంగా నేరుగా లేఖాలను ప్రయోగించడంతో వారి మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నట్లయింది. అయితే ఈ ఇద్దరి మధ్యా వాగ్బాణాల ప్రయోగానికి కారణం శాఖ లేని మంత్రి సెంథిల్‌ బాలాజి(Minister Senthil Balaji) కావడం గమనార్హం. సెంథిల్‌ బాలాజిని డిస్మిస్‌ చేస్తున్న సందర్భంగా గురువారం సాయంత్రం గవర్నర్‌ లేఖ రాయగా, అందుకు శుక్రవారం సాయంత్రం సీఎం బదులిచ్చారు. ఆ లేఖల సారాంశం సంక్షిప్తంగా..

మాటలు హద్దు మీరాయ్‌ : గవర్నర్‌

నేరారోపణకు గురైన మంత్రి సెంథిల్‌బాలాజిని పదవి నుంచి తొలగించాలని ప్రతిపాదిస్తూ గత మే 31న మీకు లేఖ రాశాను. ఆ లేఖలోని న్యాయపరమైన సారాంశాన్ని స్వీకరించడానికి బదులుగా మీరు జూన్‌ 1న ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ప్రత్యుత్తరమిచ్చారు. ఆ లేఖలో హద్దుమీరిన పదాలను కూడా ప్రయోగించారు. రెండు వారాల తర్వాత జూన్‌ 15న మంత్రి సెంథిల్‌బాలాజి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలిపి ఆయన నిర్వర్తిస్తున్న రెండు మంత్రిత్వ శాఖలను మరో ఇద్దరు మంత్రులకు అదనంగా కేటాయించాలని, శాఖలు లేని మంత్రిగా కొనసాగుతారని సిఫారసు లేఖను పంపారు. అయితే సెంథిల్‌ బాలాజిని ఈడీ అధికారులు జూన్‌ 14న అరెస్టు, జ్యుడిషియల్‌ కస్టడీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వివరాలను ఆ లేఖలో మీరు పేర్కొనలేదు. ఆ తర్వాత సెంథిల్‌భాలాజిని శాఖలు లేని మంత్రిగా కొనసాగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆ రోజే మీకు లేఖ రాశాను. వివరణ ఇవ్వకుండా మీ ప్రతిపాదనను మాత్రమే అంగీకరించాలంటూ అవాంఛనీయమైన పదజాలంతో ఆ రోజే నాకు బదులిచ్చారు. సెంథిల్‌బాలాజిపై నమోదైన కేసులో సుప్రీంకోర్టు వ్యక్తపరచిన పలు అభిప్రాయాలకు వ్యతిరేకంగా మంత్రిగా కొనసాగించడం ద్వారా హానికరమైన స్థితిని కలిగించారు. దీనితో సెంథిల్‌బాలాజి మంత్రిగా కొనసాగితే ప్రభుత్వ యంత్రాంగం దెబ్బతింటుంది కనుక ఈ పరిస్థితుల్లో భారతీయ రాజ్యాగ ధర్మాసన చట్టం 154, 163, 164 సెక్షన్లు గవర్నర్‌కు కల్పించిన అధికారాల ప్రకారం సెంథిల్‌బాలాజీని మంత్రివర్గం నుంచి డిస్మిస్‌ చేస్తున్నాను.

అవి అమర్యాదకరం: సీఎం

మీరు పంపిన రెండు లేఖలు అందాయి. మంత్రి సెంథిల్‌బాలాజిని డిస్మిస్‌ చేస్తూ రాసిన లేఖ ఈ నెల 29న రాత్రి 7 గంటలకు, ఆ డిస్మిస్‌ ఉత్తర్వును నిలుపుదల చేస్తూ రాసిన రెండో లేఖ రాత్రి 11.45 గంటలకు అందాయి. ఈ రెండు లేఖలు అమర్యాదపూర్వకంగానే ఉన్నాయి. ఈ వివాదంలో వాస్తవాలను, న్యాయపరమైన అంశాలను మీకు స్పష్టపరిచేందుకే ఈ లేఖ రాస్తున్నా. తొలుత ఈ రెండు లేఖలకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్న నా సిఫారసుగానీ, సలహాగానీ, నా మంత్రివర్గ సలహాను గానీ మీరు స్వీకరించలేదన్న విషయాన్ని తెలియజేస్తున్నా. తీవ్రమైన పదజాలంతో రాజ్యాంగ ధర్మాసనాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా తొలి లేఖను రాసిన కొన్ని గంటల్లోపే అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని స్వీకరించనున్న దృష్ట్యా ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు రెండో లేఖను పంపారు. ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు న్యాయనిపుణుల అభిప్రాయాన్ని కూడా మీరు స్వీకరించలేదని సుస్పష్టమవుతోంది. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జోక్యం చేసుకున్న మీదటే న్యాయపరమైన సలహా అవసరమని మీ ఎరుకలోకి వచ్చిందన్నదే ఇక్కడ గుర్తించాల్సిన వాస్తవం. వీటిని బట్టి మీరు రాజ్యాంగ ధర్మాసనాన్ని పట్టించుకోకుండా మీ ఇష్టానుసారం తొందరపాటుతో ప్రవర్తించారని కూడా తెలుస్తోంది. మంత్రిని తొలగించాలని, చేర్చాలని ఆదేశించడం రాజ్యాంగ ధర్మాసనానికి విరుద్ధం. తీవ్రపదజాలంతో లేఖ రాసినట్లు చెప్పడం కూడా సరికాదు. తమిళ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారమే మిమ్మల్ని సాదరంగా గౌరవిస్తున్నాం. అదే సమయంలో చట్టవిరుద్ధంగా తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని మీరు భావించకూడదు. అంతేకాకుండా మీరు ఓ వర్గానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకే మాజీ మంత్రులపై ఆరోపణలకు సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది మీ పక్షపాత ధోరణికి నిదర్శనం.గుట్కా కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరినా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో మీరు ద్వంద్వ వైఖరినే అవలంబిస్తున్నారు. ఇక మంత్రి సెంథిల్‌బాలాజి విషయాన్ని వస్తే ఈడీ విచారణను మాత్రమే ఎదుర్కొంటున్నారు.ఇంకా చార్జ్‌షీటూ దాఖలు కాలేదు. విచారణను మంత్రి అడ్డుకుంటారని చెప్పడం కూడా సరికాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రివర్గ సభ్యులను తొలగించే అధికారం మీకు లేదు. కనుక సెంథిల్‌బాలాజి శాఖలు లేని మంత్రిగా కొనసాగితీరుతారని మీకు స్పష్టం చేస్తున్నా.

Updated Date - 2023-07-01T07:39:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising