Chennai: కర్ణాటక బంద్ ఎఫెక్ట్.. సరిహద్దుల్లో ఆగిన వాహనాలు
ABN, First Publish Date - 2023-09-30T09:00:05+05:30
రాష్ట్రానికి కావేరి జలాల పంపిణీని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాలు కర్ణాటక(Karnataka)లో శుక్రవారం నిర్వహించిన బంద్ ప్రభావం వల్ల రాష్ట్ర సరిహద్దు
ప్యారీస్(చెన్నై): రాష్ట్రానికి కావేరి జలాల పంపిణీని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాలు కర్ణాటక(Karnataka)లో శుక్రవారం నిర్వహించిన బంద్ ప్రభావం వల్ల రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో అన్ని వాహనాలు నిలిచిపోయాయి. అందువల్ల అత్యవసర పనుల మీద కర్ణాటకకు వెళ్లాల్సిన ప్రజలు వాహనాలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. విల్లుపురం, సేలం, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై(Villupuram, Salem, Chengalpattu, Kanchipuram, Chennai) తదితర మండలాల నుంచి నడిపిన 430 ప్రభుత్వ బస్సులను కృష్ణగిరి జిల్లా హోసూరు(Krishnagiri District Hosur) సమీపంలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జూజువాడిలో నిలిపివేశారు. రాష్ట్ర పోలీసులు తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబరు కలిగిన వాహనాలను రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిపివేశారు. అలాగే, రాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబరు కలిగిన లారీలు, కార్లు, జీపులు, ఆటోలు, పర్యాటక వాహనాలను సైతం జూజువాడి వరకే అనుమతించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా డీఐజీ రాజేశ్వరి పర్యవేక్షణలో మూడంచెల పోలీసు భద్రత ఏర్పాటైంది. ఈరోడ్, ధర్మపురి జిల్లాల నుంచి సత్యమంగళం, తింబం ఘాట్ మీదుగా కొల్లేకాల్, ఛామరాజ్ నగర్, మైసూరు తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను రాష్ట్రప్రభుత్వ రవాణా శాఖ రద్దు చేసింది. తిరుప్పూర్, కోయంబత్తూర్, ఈరోడ్(Tiruppur, Coimbatore, Erode) తదితర ప్రాంతాల నుంచి తాళవాడికి వెళ్లాల్సిన బస్సులు, ఇతర వాహనాలను గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచే హోసూరులో నిలిపి వేశారు.
Updated Date - 2023-09-30T09:00:05+05:30 IST