Chennai: సనాతన వివాదం.. మంత్రిపై చర్యలు చేపట్టాలంటూ పిటిషన్
ABN, First Publish Date - 2023-09-16T10:51:27+05:30
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)పై చర్యలు చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను
పెరంబూర్(చెన్నై): సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)పై చర్యలు చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసర కేసుగా విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇటీవల నగరంలో తమిళనాడు అభ్యుదయ రచయితల సంఘం నిర్వహించిన సనాతన నిర్మూలన సదస్సుకు హాజరైన మంత్రి ఉదయనిధి, కరోనా, మలేరియా, టైఫాయిడ్ వంటి వాటిని నిర్మూలించినట్లు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. మంత్రి ఉదయనిధి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ సహా హిందూ సంఘాలు మంత్రి ఉదయనిధికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టగా, పలు రాష్ట్రాల్లో ఉదయనిధిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, పలు హిందూ సంస్థల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజావ్యాజ్యంలో, సనాతన ధర్మం కోసం ఆరోపణలు చేసిన మంత్రి ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసును అత్యవసరంగా పరిగణించి విచారణ చేపట్టాలని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం ముందు పలువురు న్యాయవాదులు అభ్యర్థించారు. కానీ, ఇలాంటి అప్పీలుకు సమయం ముగిసిందని, కానీ న్యాయవాదులు అప్పీలు చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విధివిధానాలను సక్రమంగా పాటించి అప్పీలు దాఖలుచేయాలని న్యాయవాదులకు సూచించారు. దీంతో, వచ్చే మంగళవారం అప్పీలు చేయాలని న్యాయవాదులు నిర్ణయించారు.
Updated Date - 2023-09-16T10:51:27+05:30 IST