ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Narendra Modi: రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల్లో అవినీతి.. ఛత్తీస్‌గఢ్ సర్కార్‌పై మోదీ ఫైర్..!

ABN, First Publish Date - 2023-09-14T21:27:30+05:30

ఛత్తీస్‌గఢ్‌ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలున్నాయని అన్నారు. ఆవు పేడ సేకరణ స్కీమ్‌లో అవినీతి చోటుచేసుకున్నట్టు విమర్శించారు.

రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌ (Chhattishgarh) లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విమర్శల దాడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలున్నాయని అన్నారు. ఆవు పేడ సేకరణ స్కీమ్‌లో అవినీతి చోటుచేసుకున్నట్టు విమర్శించారు. రాయ్‌గఢ్‌లో గురువారంనాడు జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంలో వెనకబడిందని, అవినీతిలో ముందుందని అన్నారు. మాటలు తప్ప చేతలు లేవన్నారు.


''ఒకప్పుడు నక్సలైట్ల దాడులు, హింసాత్మక ఘటనలకు ఛత్తీస్‌గఢ్ పేరుపడింది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈరోజు ఛత్తీస్‌గఢ్‌కు గుర్తింపు వచ్చింది. బీజేపీ చేపట్టిన అభివృద్ధి పనులే ఇందుకు కారణం'' అని మోదీ అన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తామంటూ ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన గ్యారంటీనే ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తోందని చురకలు వేశారు. దేశంలోని పేద ప్రజలకు సాధికారత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని నిలబెట్టుకుని ఉంటే మోదీ ఇంతగా కష్టపడాల్సి వచ్చేది కాదన్నారు. పేదలకు సాధికారత కల్పిస్తామని మోదీ ఇచ్చిన హామీ ఈరోజు ఫలితాలు ఇస్తోందని చెప్పారు. కేవలం 5 ఏళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపబడ్డారని అన్నారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.


దేశాభివృద్ధిలో ఛత్తీస్‌గఢ్ 'పవర్ హౌస్' వంటివదని ఆయన అభివర్ణించారు. తొమ్మిదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌ను అనేకరంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో రైల్వేలకు సంబంధించి తాము కొత్త చరిత్రను లిఖించామని చెప్పారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా రూ.6,350 కోట్ల విలువైన పలు రైలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్స్‌కు శంకుస్థాపన చేశారు.

Updated Date - 2023-09-14T21:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising