ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP functionaries: ద్వేషపూరిత పోస్టులు పెట్టిన 8మంది బీజేపీ నేతలకు పోలీసుల నోటీసులు

ABN, First Publish Date - 2023-04-15T11:03:27+05:30

సోషల్ మీడియాలో ద్వేషపూరిత పోస్టులు పెట్టిన బీజేపీ నేతలకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు....

Chhattisgarh police
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్): సోషల్ మీడియాలో ద్వేషపూరిత పోస్టులు పెట్టిన బీజేపీ నేతలకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.(Chhattisgarh police) 8 మంది బీజేపీ నేతలు(BJP functionaries) తమ ముందు హాజరు అయి సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన వాస్తవాలను సమర్పించాలని ఛత్తీస్‌గఢ్ పోలీసులు నోటీసుల్లో(Notices) కోరారు. సోషల్ మీడియాలో ద్వేషపూరిత కంటెంట్‌ను పోస్ట్ చేశారనే(Hateful Social Media posts) ఆరోపణలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోని 8 మంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. నోటీసులు అందుకున్న 8 మంది కార్యకర్తల్లో బీజేపీ అధికార ప్రతినిధి సంజయ్ శ్రీవాస్తవ, బీజేపీ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ సునీల్ పిళ్లై, కోశాధికారి నందన్ జైన్, బీజేపీ ట్రేడ్ సెల్ అధ్యక్షుడు కేదార్‌నాథ్ గుప్తా, బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు యోగి సాహు, డివిజనల్ యువమోర్చా కోఆర్డినేటర్ కమల్ శర్మ,బీజేపీ యువమోర్చా సభ్యుడు శుభంకర్, పార్టీ కార్యకర్త బిట్టు పాణిగ్రాహి ఉన్నారని రాయ్‌పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ అగర్వాల్ చెప్పారు.

బీజేపీ నేతలు తమ సోషల్ మీడియా పోస్ట్‌లతో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొంటూ కాంగ్రెస్ ఏప్రిల్ 12న రాయ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలోని బెమెతర జిల్లాలోని బీరాన్‌పూర్‌లో జరిగిన మత హింసకు సంబంధించి బీజేపీ సభ్యుల పెట్టిన పోస్ట్‌లు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను అవమానకరమైన పదాలను ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి.విద్వేషపూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవాలని గత ఏడాది అక్టోబర్ 21న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి : Covid cases: కరోనా వైరస్ కేసుల సంఖ్యపై కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఏం చెప్పారంటే...షాకింగ్

రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీరాన్‌పూర్ గ్రామంలో హింస చెలరేగింది, ఇది 22 ఏళ్ల భునేశ్వర్ సాహు మరణానికి, ముగ్గురు పోలీసులకు గాయాలకు దారితీసింది.ఏప్రిల్ 10వతేదీన మితవాద సంస్థలు పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ సందర్భంగా రెండు ఇళ్లు కాలిపోగా, గ్రామస్తులు రహీమ్ మహ్మద్, అతని కుమారుడు ఇదుల్ మహ్మద్ మృతదేహాలు బయటపడ్డాయి.

Updated Date - 2023-04-15T11:03:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising