ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vishnu Deo Sai: అనూహ్యంగా సీఎం పీఠం.. ఎవరీ విష్ణుదేవ్ సాయి?

ABN, First Publish Date - 2023-12-10T17:23:43+05:30

ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని ఛత్తీస్‌గఢ్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో గిరిజన నేతను సీఎం చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర ఇచ్చిన హామీ సాకారమైంది.

రాయపూర్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయి (Vishnu Deo Sai)ని ఛత్తీస్‌గఢ్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో గిరిజన నేతను సీఎం చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర ఇచ్చిన హామీ సాకారమైంది. గిరిజన నేతగా పేరున్న విష్ణుదేవ్ సాయి మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. 59 ఏళ్ల విష్ణు దేవ్ సాయి కేంద్ర మాజీ మంత్రిగా, లోక్‌సభ ఎంపీగా, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు.


అనూహ్యంగా తెరపైకి..

ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరనే దానిపై వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఆదివారంనాడు తెరదించుతూ విష్ణు దేవ్ సాయి పేరును సీఎంగా ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. సీఎం అభ్యర్థుల పేర్లలో విష్ణు దేవ్ పేరు మొదట్నించీ వినిపిస్తున్నప్పటికీ రమణ్ సింగ్, రేణుగా సింగ్ పేర్లు ముందువరుసలో ఉన్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిపిన కేంద్ర పరిశీలకులు విష్ణుదేవ్ సాయి పేరును ముఖ్యమంత్రిగా లాంఛనంగా ప్రకటించారు.


ఎవరీ విష్ణుదేవ్..?

1.విష్ణుదేవ్ సాయి 2020 నుంచి 2022 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

2.అజిత్ జోగి తరువాత ఛత్తీస్‌గఢ్‌కు రెండవ గిరిజన ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కానున్నారు. షెడ్యూల్ తెగలకు (ఎస్‌టీ) చెందిన అజిత్ జోగి 2019లో సీఎంగా ఉన్నారు.

3.2014లో తొలిసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన మంత్రివర్గంలో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా విష్ణు దేవ్ సాయి పనిచేశారు.

4.విష్ణుదేవ్ సాయి రాయగఢ్ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు.

5.మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్ విడిపోక ముందు 1990-98 మధ్య మధ్యప్రదేశ్ అసెంబ్లీ సభ్యుడిగా విష్ణుదేవ్ సాయి తన రాజకీయ కెరీర్ ప్రారంభించారు.

6.ఇటీవల ముగిసిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కుంకూరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యూడీ మింజ్‌పై గెలుపొందారు.

7. విష్ణుదేవ్ సాయి 1999 నుంచి 2014 వరకూ వరుసగా నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Updated Date - 2023-12-10T17:38:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising