ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: సీఎం స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-07-18T07:56:32+05:30

ప్రతిపక్షాలు ఏమవుతున్నాయన్న మంటతోనే కేంద్రంలోని బీజేపీ పాలకులు తన మంత్రివర్గ సహచరులపై ఈడీని ఉసిగొల్పుతున్నారని డీఎంకే

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షాలు ఏమవుతున్నాయన్న మంటతోనే కేంద్రంలోని బీజేపీ పాలకులు తన మంత్రివర్గ సహచరులపై ఈడీని ఉసిగొల్పుతున్నారని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(DMK President and Chief Minister MK Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో మంగళవారం జరగనున్న ప్రతిపక్ష నేతల రెండో విడత సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం ఉదయం పయనమై వెళ్తూ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఎకమవుతుండడం చూసి కేంద్రంలోని పాలకులు సహించలేకపోతున్నారని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగళూరు(Bangalore)లో దేశంలోని 24 ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమవుతున్నారని ఆయన చెప్పారు. ఇదివరకే ఉత్తరాదిలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈడీని ఉసిగొల్పిన బీజేపీ పాలకులు.. ప్రస్తుతం తమ రాష్ట్రంపై దృష్టి సారించినట్టు ఆరోపించారు. ఈడీ దాడులకు తాము ఎన్నడూ భయపడే ప్రసక్తేలేదని అన్నారు. మంత్రి పొన్ముడికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జయలలిత హయాంలో దాఖలు చేసిన కేసు అనీ, 13 యేళ్ల తర్వాత దాన్ని తిరగతోడేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మంత్రి పొన్ముడి ఈ కేసును కూడా చట్ట ప్రకారం ఎదుర్కొని నిర్దోషిగా బయటపడతారన్నారు. కర్ణాటక పరాభవాన్ని గురించి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Govt) ఈడీని ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతోందన్నారు. వచ్చే యేడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు గాను రాష్ట్రంలో ఒకవైపు గవర్నర్‌, మరో వైపు ఈడీ అధికారులు డీఎంకేకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు. పట్నాలో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్నప్పుడు ఈడీ అధికారులు మంత్రి సెంథిల్‌బాలాజి నివాసగృహంలో తనిఖీ చేశారని, అదే విధంగా ప్రస్తుతం బెంగళూరులో జరగనున్న ప్రతిపక్ష నేత సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్నపుడు మంత్రి పొన్ముడి నివాస గృహాల్లో సోదాలు నిర్వహించడం యాదృచ్ఛికం, దురుద్దేశపూరితంగానే ఈ దాడులు జరిగాయని స్టాలిన్‌ ధ్వజమెత్తారు. ఇదిలా వుండగా బెంగళూరు చేరుకున్న సీఎంకు విమానాశ్రయంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Karnataka Deputy Chief Minister DK Shivakumar) నేతృత్వంలోని బృందం సాదర స్వాగతం పలికింది.

Updated Date - 2023-07-18T07:56:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising