Chief Minister: ఆ మంత్రి శాఖల బదిలీకి సీఎం నిర్ణయం?
ABN, First Publish Date - 2023-06-16T12:34:22+05:30
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడంతో ఆస్పత్రి పాలైన మంత్రి సెంథిల్ బాలాజీ(Minister Senthil Balaji) వద్ద వున్న విద్యు
- గవర్నర్‌కు సిఫారసు
- వివరణ కోరిన రవి
పెరంబూర్(చెన్నై): ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడంతో ఆస్పత్రి పాలైన మంత్రి సెంథిల్ బాలాజీ(Minister Senthil Balaji) వద్ద వున్న విద్యుత్, ఎక్సైజ్‌శాఖల్ని ఇతర మంత్రులకు కేటాయించాలని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) నిర్ణయించినట్లు తెలిసింది. ఆ మేరకు ఆర్ధికశాఖ మంత్రి తంగం తెన్నరసుకు విద్యుత్ శాఖ, గృహ వసతి శాఖ మంత్రి ముత్తుస్వామికి ఎక్సైజ్ శాఖ అదనంగా అప్పగించాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi)కి సిఫారసు చేసినట్లు తెలిసింది. మంత్రి సెంథిల్ బాలాజీకి శస్త్రచికిత్స చేయాల్సి ఉండడంతో సీఎం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఒకవేళ సీఎం ఈ సిఫారసును ఆమోదిస్తే సెంథిల్ బాలాజి ఏ శాఖ లేని మంత్రిగా మిగిలిపోనున్నారు.
గవర్నర్ నిరాకరణ....?
ఇద్దరు మంత్రులకు అదనపు శాఖలు కేటాయించాలన్న సీఎం సిఫారసును గవర్నర్ నిరాకరించినట్లు తెలిసింది. ఆ సిఫారసులో మంత్రి సెంథిల్ బాలాజీకి శస్త్రచికిత్స అని మాత్రమే పేర్కొన్నారని, కానీ, ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసిన విషయంపై స్పష్టత లేనందున దానిని ఆమోదించలేనంటూ గవర్నర్ సిఫారసును తిప్పి పంపినట్లు సమాచారం. దాంతో మళ్లీ గవర్నర్‌కు లేఖ పంపాలని సీఎం నిర్ణయించినట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి.
Updated Date - 2023-06-16T12:34:22+05:30 IST