ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: సీఎం సంచలన వ్యాఖ్యలు.. మళ్లీ బీజేపీ గెలిస్తే అధోగతే

ABN, First Publish Date - 2023-07-27T08:12:49+05:30

దేశాన్ని, రాష్ట్రాన్ని పెనుముప్పు నుంచి కాపాడాలంటే వచ్చే యేడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఓడించి తీరాల్సిందేనని డీ

- లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి

- డీఎంకే పోలింగ్‌ కేంద్రాల ఇన్‌చార్జీలతో స్టాలిన్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): దేశాన్ని, రాష్ట్రాన్ని పెనుముప్పు నుంచి కాపాడాలంటే వచ్చే యేడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఓడించి తీరాల్సిందేనని డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌(CM Stalin) పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం తిరుచ్చి రాంజీనగర్‌ మైదానంలో ఏర్పాటు చేసిన డీఎంకే పోలింగ్‌ కేంద్రాల ఇన్‌చార్జీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకమైనవని, ఆ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి రాకూడదన్నదే ప్రధాన అంశమన్నారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశం ముక్కలైందని, మణిపూర్‌లో హింసాకాండ చెలరేగుతోందని, సామాజిక న్యాయాన్ని పాతిపెట్టేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూటమిని మట్టికరిపించాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే పోలింగ్‌ కేంద్రాల ఇన్‌చార్జీలదే కీలక పాత్ర అని, కూటమి గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుండే శ్రమించాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, నకిలీ ఓటర్లను తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అదే సమయంలో ఓటర్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వాటిని ఎమ్మెల్యేలు, ఎంపీల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం సాగించాలన్నారు. 75వ వార్షికోత్సవంలో అడుగిడనున్న డీఎంకే కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరి సహా 40 స్థానాల్లో గెలిచేందుకు పాటుపడాలని కోరారు. ఆ దిశగా పోలింగ్‌ కేంద్రాల ఇన్‌చార్జీలు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఖాతాలు తెరవాలని, పార్టీపై దుష్ప్రచారాలకు వెనువెంటనే ఖండించాలన్నారు.

మనకు గవర్నరే ప్రచారకర్త

లోక్‌సభ ఎన్నికలు జరిగేంతవరకూ గవర్నర్‌గా ఆర్‌ఎన్‌ రవి(RN Ravi as Governor) కొనసాగాలనే తాను కోరుకుంటున్నానని, డీఎంకే ప్రభుత్వానికి ప్రధాన ప్రచారకర్త ఆయనేనని స్టాలిన్‌ ఎద్దేవా చేశారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే దేశానికి జరుగబోయే అరిష్టాలను తాను అన్ని సభల్లో వివరిస్తుండటం వల్లే ప్రధాని మోదీ ఆగ్రహించి ఏ రాష్ట్రంలో సభ జరిగినా తమిళనాడులో డీఎంకే వారసత్వ పాలన అంటూ విమర్శిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ చెబుతున్నట్లు రాష్ట్రంలో డీఎంకే వారసత్వ పాలననే ప్రజలకు అందిస్తోందని, పెరియార్‌, అన్నాదురై, కరుణానిధి(Periyar, Annadurai, Karunanidhi) ఆశయాలను, సిద్ధాంతాలను వారసత్వంగా అందిస్తున్నామన్నారు. 26 పార్టీలతో ఏర్పాటైన ఇండియా కూటమిని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు.

ఇటీవల జరిగిన ఎన్డీయే సమావేశంలో అవినీతిలో కూరుకుపోయిన మాజీ సీఎం ఈపీఎన్‌ను పక్కనపెట్టుకుని డీఎంకేది అవినీతి పాలన అంటూ మోదీ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీకి గులాములు కాదని చెప్పుకుంటున్న ఈపీఎస్‌... మణిపూర్‌ హింసాకాండపై ఎందుకు నోరుమెదపడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో డీఎంకే న్యాయవాదుల విభాగం కార్యదర్శి ఎన్‌ఆర్‌ ఇళంగో ఓటర్ల జాబితా సవరణ పనులు గురించి వివరించారు. ద్రావిడ తరహా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, సాంఘిక సంక్షేమ పధకాలు అనే అంశంపై మంత్రులు అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, శివశంకర్‌, టీఆర్‌బీ రాజా, ఎంపీ రాజా, యాప్‌ పనితీరు అనే అంశంపై ఎంపీ ఎంఎం అబ్దుల్లా, సామాజిక ప్రసార మాధ్యమాలు అనే అంశంపై డీఎంకే విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ తదితరులు ప్రసంగించారు.

Updated Date - 2023-07-27T08:12:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising